మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కి ప్రమాదం.. పూర్తిగా ధ్వంసమైన కారు, తృటిలో తప్పిన ప్రాణాపాయం

Siva Kodati |  
Published : Jun 20, 2021, 08:44 PM ISTUpdated : Jun 20, 2021, 09:15 PM IST
మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కి ప్రమాదం.. పూర్తిగా ధ్వంసమైన కారు, తృటిలో తప్పిన ప్రాణాపాయం

సారాంశం

తెలంగాణ మంత్రి హరీశ్ రావు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు భారీగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. 

తెలంగాణ మంత్రి హరీశ్ రావు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు భారీగా ధ్వంసమైంది. సిద్ధిపేట శివారులో మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు అడ్డొచ్చాయి.

 

 

దీంతో వాటిని తప్పించేందుకు పైలట్ వాహనం సడెన్ బ్రేక్ వేసింది. దీంతో కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో మంత్రి హరీశ్ రావు గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. కొండపాక మండలం బందారం దర్గా కమాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అనంతరం మరో కారులో హరీశ్ రావు హైదరాబాద్ బయల్దేరారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. 

 

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు