నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి కరోనా తెప్పించారు: నవ్వులు పూయించిన కేసీఆర్

Siva Kodati |  
Published : Jun 20, 2021, 07:07 PM IST
నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి కరోనా తెప్పించారు: నవ్వులు పూయించిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత మంచి వక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఉపన్యాసాల ద్వారా జనాలను చైతన్యపరిచారు. ప్రజల్లో ఉర్రతూలుగించడంతో పాటు ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో కేసీఆర్ దిట్ట. 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత మంచి వక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఉపన్యాసాల ద్వారా జనాలను చైతన్యపరిచారు. ప్రజల్లో ఉర్రతూలుగించడంతో పాటు ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో కేసీఆర్ దిట్ట. వాడివేడి విమర్శలతో పాటు జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతారు. తాజాగా తనలోని వక్తను బయటకు తెచ్చారు. ఇటీవల కరోనా బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్నిరోజుల్లోనే కోలుకున్నారు. సీఎంకు కరోనా పాజిటివ్ రావడం పట్ల చాలామంది ఆశ్చర్యపోయారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయనకు ఎలా వచ్చిందని అనుకున్నారు. అయితే, ఇవాళ సిద్ధిపేటలో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ ఆసక్తికరంగా ప్రసంగిస్తూ, తనకు కరోనా ఎలా సోకిందో కామెడీగా వివరించారు.

Also Read:బంగారు తెలంగాణ వచ్చి తీరుతుంది: కేసీఆర్

"ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాను, అక్కడ పెళ్లి కొడుకు మాస్కు తీసేయాలని కోరాడు. మాస్కు తీయడం ఎందుకని అడిగితే, మీరు మళ్లీ మాకు దొరకరు కదా సార్, అందుకే ఫొటో తీసుకుందామని మాస్కు తీయమన్నాం సార్ అని ఆ పెళ్లికొడుకు చెప్పాడు. తాను నీకు దొరకడం ఏమో కానీ, మాస్కు తీసేస్తే కరోనాకు నేను దొరుకుతా అని చెప్పా. ఆ విధంగా నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి నాక్కూడా కరోనా వచ్చింది" అని కేసీఆర్ సభలో నవ్వులు పూయించారు

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu