కరీంనగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల జరగ్గా రెండింటిని మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుచేకోవడం టీఆర్ఎస్ బలానికి నిదర్శనమని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు.
కరీంనగర్: తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ (trs) దే అని... సీఎం కేసీఆర్ (cm kcr) బొమ్మే తమ గెలుపు మంత్రమని మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలోకి దింపిన పార్టీ అభ్యర్థులు ఎల్.రమణ (l ramana), భానుప్రసాద్ రావు (bhanuprasad rao) మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం టీఆర్ఎస్ బలానికి సంకేతమన్నారు. ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికను ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీకి పెట్టినా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ప్రతిపక్షాలకు చెంప చెల్లుమనిపించేలా స్థానిక సంస్థల ఓటర్లు చేసారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసిన ప్రతీ ఒటరుకు మంత్రి గంగుల ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్ లో మంత్రి గంగుల మాట్లాడారు. మొత్తం 1324 ఓట్లలో 870 టీఆర్ఎస్ జెండా మీద గెలిచామని... మరో 116 మంది కేసీఆర్ పాలన పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యారని అన్నారు. ఇలా టీఆర్ఎస్ కు 986 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యం ఉంది కాబట్టే ఎన్నికలకు వెళ్లామన్నారు మంత్రి గంగుల.
undefined
Video
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీ పోటీ నుండి తప్పుకున్నాయని... ఇండిపెండెంట్లు సైతం పోటీలో ఉండమన్నారని తెలిపారు. కానీ కొందరు కడుపుమంటతో అక్రమ కలయికలు, అపవిత్ర పొత్తుతో అభ్యర్థిని పోటీలో నిలిపారని దుయ్యబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీతో కూడిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిస్తామనడం రాజకీయాల్లో నీచ చర్యగా మంత్రి గంగుల అభివర్ణించారు.
read more ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు... అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన 986 ఓట్లలో ఒక్క ఓటు కూడా తగ్గదని విసిరిన సవాల్ ను గంగల గుర్తుచేసారు. బిజెపికి చెందిన 105 ఓట్లతో కలుపుకుని ప్రతిపక్షాలన్నింటికి కలిపి మొత్తం 324 ఓట్లు వుంటాయని... వాటిని కూడా పూర్తిగా దక్కించుకోలేకపోయారని మంత్రి ఎద్దేవా చేసారు. కరీంనగర్ లో బరిలో ఉన్న అభ్యర్థిపై వ్యతిరేకతతో కేవలం 234 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 80 ఓట్లు కూడా టీఆర్ఎస్ కే పడ్డాయని... దీంతో 1063 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని మంత్రి గంగుల వెల్లడించారు.
గతంలో హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మపై 43వేల ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలిచారని గుర్తుచేసారు. కానీ మొన్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తు వున్నప్పటికి ఆ స్థాయి మెజార్టీ ఎందుకు రాలేదో ప్రశ్నించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా ఉన్న ఈ అపవిత్ర పొత్తును ఏ విదంగా తీసుకుంటారో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమాదానం చెప్పాలని మంత్రి గంగుల డిమాండ్ చేసారు.
తెలంగాణలో పెండ్లికి, చావుకి ఒకేరకమైన బరత్ ఉంటుందని... ప్రతిపక్షాలు చేస్తున్న ర్యాలీలు ఎలాంటివో తెలుసుకోవాలన్నారు. ప్రజాభిమానం ఉన్న కేసీఆర్, టీఆర్ఎస్ ని చూస్తే కొందరికి కడుపు మండుతుందని... దీన్ని ఓర్వలేక అపవిత్ర పొత్తులకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకొని, ప్రజా రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు.
read more Madhusudhana Chary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
ఎన్నికలు అయిపోయాయని ఇక అభివృద్దిపై దృష్టి సారిద్దామని సూచించారు.రాజకీయాలు మాట్లాడే అవకాశం మాకు ఇవ్వవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. అందరూ కలిసి కరీంనగర్ జిల్లాని అభివృద్ది పథంలో నడిపిద్దామని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్ రమణ, భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ తదితర నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఆర్ఎస్ విజయంతో బాణాసంచా కాల్చడంతో పాటు ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.