రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కీలకమైన పాత్రను పోషించనుందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ తెలిపారు. ఇవాళ ఆయన హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ తన కర్తవ్యాన్ని పోషించనుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైఎస్ చైర్మెన్ వినోద్ చెప్పారు. మంగళవారం నాడు Trsస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.Dmkనే కాదు దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుస్తామన్నారు. తాము ఎవరితో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు.టీఆర్ఎస్ పనైపోయిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఓట్లు గంప గుత్తగానే తమ పార్టీకే దక్కాయన్నారు.
మరో వైపు ఇతర పార్టీలకు చెందిన ఓట్లు కూడా తమ పార్టీ అభ్యర్ధులకు దక్కాయని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేసిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు అని ఆయన చెప్పారుకేంద్రంలోని Bjp అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పబుట్టారు. Cbse ప్రశ్న పత్రంలో మహిళలను కించపర్చేలా ఉన్న ప్రశ్న గురించి ఆయన ప్రస్తావించారు. విద్యా విధానంలో మార్పుల పేరుతో స్త్రీలను చులకనగా బీజేపీ చూస్తోందన్నారు. ఇందుకు ఈ ప్రశ్నాపత్రమే ఉదహరణగా ఆయన పేర్కొన్నారు.బీజేపీ కూడా ఓ ప్రాంతీయ పార్టీయేనని ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అతి చిన్న ప్రాంతీయ పార్టీగా ఆయన అభివర్ణించారు.తమిళనాడు టూర్ లో ఉన్న సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను మంగళవారం నాడు కలిశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై బీజేపీయేతర పార్టీల సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు.ఈ విషయమై కేసీఆర్ చర్చించనున్నారు.