33 నూతన బీసీ గురుకులాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం.. మంత్రి గంగుల కమలాకర్

By Sumanth KanukulaFirst Published Sep 2, 2022, 3:51 PM IST
Highlights

తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శుక్రవారం మంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. 

తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శుక్రవారం మంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు మంతరి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. 15 నూతన డిగ్రీ కళాశాలలను అక్టోబర్ 15 నుంచి తరగతులను నిర్వహించాలని చెప్పారు. ఈ నూతన గురుకులాలతో రాష్ట్రంలో బీసీల కోసం కేసీఆర్ కేటాయించిన గురుకులాల సంఖ్య 310కి చేరిందన్నారు. 

ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 41 కులసంఘాలకు 95.25కోట్లు, కోకాపేట, ఉప్పల్ బగాయత్‌లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమై పట్టాలు పొందాయన్నారు. మిగతా సంఘాల్లో సైతం ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.. ఇలా ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

click me!