గురుకుల పాఠశాల విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలి:కేసీఆర్ కు భట్టి విక్రమార్క లేఖ

Published : Sep 02, 2022, 03:23 PM ISTUpdated : Sep 02, 2022, 04:28 PM IST
గురుకుల పాఠశాల విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలి:కేసీఆర్ కు భట్టి విక్రమార్క లేఖ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాడు లేఖ రాశారు. గురుకుల విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని ఆ లేఖలో భట్టి విక్రమార్క కోరారు.

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ కు  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాడు లేఖ రాశారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్ధులకు  మంచి భోజనం పెట్టాలని ఆ లేఖలో భట్టి విక్రమార్క కోరారు. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని ఆయన కోరారు.

పక్కా భవనాల  నిర్మాణానికి అవసరమైననిధులను కేటాయించాలని ఆ లేఖలో భట్టి విక్రమార్క సీఎం ను కోరారు. విద్యార్ధులు ఉంటున్న హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు గాను చర్యలు తీసుకోవాలని సీఎం ను కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు మాసాలైనా కూడా పుస్తకాలు ఇంకా అందని విషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తు చేశారు.త్వరలోనే గురుకుల, ప్రభుత్వ హస్టల్స్, జూనియర్ కాలేజీలను సందర్శిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు