మునుగోడు ఉపఎన్నిక 2022 : కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లతో రేవంత్ రెడ్డి భేటీ.. రేపు ప్రచారానికి అగ్రనేతలు

By Siva KodatiFirst Published Sep 2, 2022, 3:46 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో.. అక్కడి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీఆర్ఎస్  , బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేపు మునుగోడులోనే ఛార్జీషీట్ విడుదల చేయబోతోంది కాంగ్రెస్. 

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో.. అక్కడి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేపటి పర్యటనపై చర్చించారు. రేపు మునుగోడుకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ వెళ్లనున్నారు. టీఆర్ఎస్  , బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేపు మునుగోడులోనే ఛార్జీషీట్ విడుదల చేయబోతోంది కాంగ్రెస్. 

ఇకపోతే.. మునుగోడులో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్ధుల జాబితాను టీపీసీసీ నాయకత్వం ఎఐసీసీకి పంపింది.త్వరలోనే మునుగోడు అభ్యర్ధిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.  అభ్యర్ధిని ప్రకటించే లోపుగానే  నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనిలో భాగంగా రేపటి నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇప్పటికే ఆయా మండలాలకు ఇంచార్జీలుగా నియమించిన నేతలు కూడా నియోజకవర్గాల్లోని మండలాల్లో మకాం వేయనున్నారు. 

ALso Read:మునుగోడు అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు పంపించాం.. ఏఐసీసీదే తుది నిర్ణయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మరోవైపు.. మునుగోడులో కాంగ్రెస్ బలంగానే ఉంటుంది. గతంలో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే మునుగోడు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి లాక్కునేందుకు బీజేపీ, టీఆర్ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హస్తం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. నేతలు, క్యాడర్ జారిపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అభ్యర్ధిని వీలైనంత త్వరగా ప్రకటించి... ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తోంది. 

click me!