ఎంతో చెమటోడ్చి.. కష్టపడి సంపాదించిన పైసలతో కొన్న నా భూమిని గుంజుకోవద్దని అప్పటి సీఎంతో చెప్పానని ఈటల తెలిపారు. నీ పాత అలైన్‌మెంట్ ప్రకారం చేసుకోమని చెప్పానని.. కానీ, తన భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశానని.. అంతేకాని పార్టీ మారతానని మాత్రం చెప్పలేదని ఈటల వెల్లడించారు
మంత్రి పదవి విషయంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు మంత్రి పదవి ఎవరో వేసిన భిక్ష కాదని.. కులంతో కొట్లాటతో వచ్చిన పదవి కాదని ఈటల స్పష్టం చేశారు.
ఒక అనామక మనిషిగా వచ్చి.. ఈ గడ్డ మీద ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలవడమన్నది ఓ చరిత్ర అని ఈటల స్పష్టం చేశారు. తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ చరిత్ర లేదని.. తనకు తానుగా రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు తానుగానే నిలబడతానని ఆయన తెలిపారు.
కులంతో కొట్లాట పెట్టే మనిషిని తాను కాదన్నారు. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశానని.. ఆనాడు ముఠాలు జైళ్లలో పెట్టాలని.. చంపాలని రెక్కీ నిర్వహించినప్పుడు కూడా ‘‘ సంపుతవురా నా కొడకా’’ అని చాలెంజ్ చేశానని ఈటల గుర్తు చేశారు.
తనకు ఈ రోజు వున్న డబ్బులే ఉద్యమంలోకి వచ్చిన రోజు కూడా అలాగే ఉన్నాయన్నారు. తాను 1992లో ఊరికి వచ్చానని.. ఓఆర్ఆర్ భూమి కోసం తాను ఇల్లు కట్టుకున్న స్థలం గుంజుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లానని గుర్తు చేశారు.
ఎంతో చెమటోడ్చి.. కష్టపడి సంపాదించిన పైసలతో కొన్న నా భూమిని గుంజుకోవద్దని అప్పటి సీఎంతో చెప్పానని ఈటల తెలిపారు. నీ పాత అలైన్‌మెంట్ ప్రకారం చేసుకోమని చెప్పానని.. కానీ, తన భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశానని.. అంతేకాని పార్టీ మారతానని మాత్రం చెప్పలేదని ఈటల వెల్లడించారు.
అసెంబ్లీ వేదికగా రాజశేఖర్ రెడ్డిని ఛాలెంజ్ చేశానని.. తాను నేరుగా, ఈటల రాజేందర్‌గా గెలవలేదని, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల విముక్తి కోసం జరిగే పోరాటం వల్లే గెలిచానని, ఉద్యమం పుణ్యమాని గెలిచానని చెప్పానన్నారు.
తమను నిర్మూలించాలని కుట్ర జరిగినప్పుడు ‘‘ చచ్చినా ఫర్వాలేదని.. కానీ, తెలంగాణ జెండా మాత్రం వదిలేది లేదని అప్పట్లో చెప్పినట్లు ఈటల వెల్లడించారు.
వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్
కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్
ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?