ప్రీతి ఆత్మహత్యాయత్నంపై రాజకీయ చిచ్చు పెట్టొద్దు: మంత్రి ఎర్రబెల్లి

By narsimha lode  |  First Published Feb 24, 2023, 5:05 PM IST

నిమ్స్  ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న   మెడికో  ప్రీతి కుటుంబ సభ్యులను  మంత్రి దయాకర్ రావు ఇవాళ పరామర్శించారు.  
 


హైదరాబాద్:  నిమ్స్  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న మెడికో  ప్రీతి  కుటుంబ సభ్యులను  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  శుక్రవారం నాడు పరామర్శించారు. ఐసీయూలో  చికిత్స పొందుతున్న  ప్రీతి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని  మంత్రి వైద్యులను ఆదేశించారు.

ఇవాళ  మంత్రి దయాకర్ రావు నిమ్స్ వద్ద  మీడియాతో మాట్లాడారు.  ప్రీతిని సైఫ్  వేధించినట్టుగా పోలీసుల విచారణలో తేలిందన్నారు.  ప్రీతి ఆరోగ్య పరిస్థితి  ఇంకా విషమంగానే  ఉందన్నారు.  ప్రతికి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని  ఆయన  చెప్పారు.  ప్రీతి కొలుకొనే అవకాశం ఉందని వైద్యులు  చెబుతున్నారని  మంత్రి తెలిపారు.  ప్రీతి విషయంలో  రాజకీయ చిచ్చు పెట్టొద్దని  ఆయన  కోరారు.  సైఫ్ నకు శిక్ష పడేలా ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని ఆయన  చెప్పారు.  

Latest Videos

undefined

ఈ నెల  22న  ఆత్మహత్యాయత్నం  చేసిన  మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా  ఉంది.  ఆమెకు నిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స అందిస్తున్నారు.    ఎక్మో ద్వారా ప్రీతికి వైద్యం  అందిస్తున్నారు.  

మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసిందా  ఇతరత్రా కారణాలతో  ఆమె  అస్వస్థతకు  గురైందా అనే  విషయమై  విచారణ చేస్తున్నామని  ఎంజీఎం  సూపరింటెండ్  డాక్టర్ చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సైఫ్,  మెడికో ప్రీతి మధ్య వివాదానికి గల కారణాలపై  కూడా  ప్రొఫెసర్ల కమిటీ విచారణ నిర్వహిస్తుందని  డాక్టర్  చంద్రశేఖర్ రెండు రోజుల క్రితం  ప్రకటించారు.

also read:మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం: సైఫ్ నకు 14 రోజుల రిమాండ్, ఖమ్మంకు తరలింపు

మెడికో ప్రీతి  ఆరోగ్య పరిస్థితిపై  ఇవాళ  నిమ్స్ వైద్యుల బృందం  హెల్త్ బులెటిన్ విడుదల  చేసింది.  కిడ్నీ,గుండె పనితీరు మెరుగుపడినట్టుగా  ప్రకటించారు. అయితే  ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు  తేల్చి చెప్పారు.  

click me!