కుక్కల దాడిలో చిన్నారి మరణం.. ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు,లేట్ ఎందుకయ్యిందంటే..?

Siva Kodati |  
Published : Feb 24, 2023, 04:37 PM IST
కుక్కల దాడిలో చిన్నారి మరణం.. ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు,లేట్ ఎందుకయ్యిందంటే..?

సారాంశం

అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఆర్‌పీసీ 174 కింద కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఓపీనియన్ కోసం వెయిట్ చేయడంలో ఈ విషయంలో ఆలస్యం జరిగింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 రోజుల లీగల్ ఓపినియపన్ తర్వాత బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఆర్‌పీసీ 174 కింద కేసు నమోదు చేశారు. 

కాగా.. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి. 

Also REad :కుక్కల దాడిలో చిన్నారి బలి.. అంబర్‌పేట్‌లో పోలీసుల విచారణ, కార్ల షోరూమ్ ప్రతినిధులపై కేసు

ప్రదీప్ తండ్రి అక్కడికి వచ్చేలోపే చిన్నారిని ఆ కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో బాబుని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లాడిపై కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly