తెలంగాణ పల్లెల్లో కరోనా వ్యాప్తి చెందకపోడానికి కారణమదే: మంత్రి ఎర్రబెల్లి

By Arun Kumar PFirst Published Jun 8, 2020, 1:54 PM IST
Highlights

గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని... టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలు ఒకసారి గమనించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. 

కరీంనగర్: గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని... టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలు ఒకసారి గమనించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా పల్లెప్రగతి వలన పల్లెల్లో చాలా అభివృద్ధి జరిగింది...దీనితో కరోన వైరస్ వ్యాప్తి చెందలేదని అన్నారు. ఇకపైనా ప్రజలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని...  వర్షాకాలంలో కరోనా తొందరగా వ్యాపి చెందుతుంది కాబట్టి జాగ్రత్తగా వుండాలని సూచించారు. 

సోమవారం పల్లె ప్రగతి లో భాగంగా జగిత్యాల రూరల్ నర్సింగపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. గ్రామాల్లో మరింత అభివృద్ధిని చేపట్టాలనే ఉద్దేశంతో సీఎం మళ్ళీ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. 

read more  తెలంగాణలో కరోనా మృత్యు ఘంటికలు: ఒక్కరోజులో 14 మంది మృతి, 154 కేసులు

''రైతులు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్ 30 వేల కోట్లు పెట్టి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. గతంలో కరెంటు, ఎరువుల కోసం ధర్నాలే కనపడేవి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి రైతులు ఈ కరోన సమయంలో ఇబ్బంది పడొద్దు అని రూ.7000 కోట్ల అప్పు తెచ్చి రైతుబంధు ఇచ్చారు.  అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్ని నిధులు కావాలో అన్ని సమకూర్చుతా పనులు చేయించుకోండి'' అని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. 

 

click me!