కంటైన్మెంట్ ఏరియాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు అనుమతిస్తున్నట్టు తెలిపారు. షాపింగ్ మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌కు, గేమింగ్ సెంటర్లు, సినిమాహాల్స్‌కు అనుమతిలేదని స్పష్టంచేశారు.
కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండున్నర నెలలపాటు నగరంలోని చాలా దుకాణాలు, రెస్టారెంట్స్, మాల్స్, హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. కాగా... వీటికి ఇప్పుడు మోక్షం లభించింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని కొద్దిగా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపుల్లో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్ తెరుచుకోనున్నాయి.
ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు అమలుచేస్తున్నామని, అక్కడ కార్యకలాపాలకు అనుమతి లేదని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
undefined
కంటైన్మెంట్ ఏరియాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు అనుమతిస్తున్నట్టు తెలిపారు. షాపింగ్ మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌కు, గేమింగ్ సెంటర్లు, సినిమాహాల్స్‌కు అనుమతిలేదని స్పష్టంచేశారు.
మార్గదర్శకాలను అన్ని సంస్థల యజమాన్యాలు, నిర్వాహకులు పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు.
ఈ అన్ లాక్ లోనూ కరోనా నుంచి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
కరోనా వ్యాప్తిని నిలువరించడంలో కీలకమైన భౌతికదూరం పాటించడంతోపాటు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఏవైనా వస్తువులు తాకినప్పుడు లేదా పనికి ముందు, తర్వాత తప్పకుండా చేతులను శానిటైజర్/హ్యాండ్‌వాష్/సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రపర్చుకోవాలని కేంద్రం సూచించింది.
ప్రతి వాణిజ్య కార్యాలయం, హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్‌లో యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని, వినియోగదారులను తాకకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.
విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.
ఇక రెస్టారెంట్స్, మాల్స్ పాటించాల్సిన నియమాలు...
గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించొద్దు.పనిచేసే సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించడంతోపాటు చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి.కస్టమర్లు క్యూలలో నిల్చొనేటప్పుడు తప్పకుండా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
రిసెప్షన్ వద్ద శానిటైజర్లు, వాష్ ఏరియాల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేయాలి. హోటల్‌కు వచ్చే అతిథుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలి. కస్టమర్ల్ల సీటింగ్ స్పేస్ విశాలంగా ఉండేలా, వ్యక్తుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేయాలి.
50% సీటింగ్ సామర్థ్యానికి మించి వినియోగదారులను అనుమతించకూడదు. డిస్పోజబుల్ మెనూలను వాడాలి. ఒకరు వాడిన మెనూను మరొకరు వాడకుండా చూడాలి. బట్ట న్యాప్‌కిన్‌లకు బదులు వినియోగదారులకు కాగితపు న్యాప్‌కిన్‌లు ఇవ్వాలి.