
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేశారు. బీజేపీకి కాంగ్రెస్ వంత పాడుతుందని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.