కేటీఆర్‌తో మహారాష్ట్ర మాజీ సీఎం తనయుడు కీలక భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!

Published : Apr 11, 2023, 04:35 PM IST
కేటీఆర్‌తో మహారాష్ట్ర మాజీ సీఎం తనయుడు కీలక భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!

సారాంశం

శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే నేడు హైదరాబాద్‌లోని టీఈహెచ్‌బీని సందర్శించారు. ఈ తరుణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పలు కీలక ఆంశాలపై చర్చించారు. అయితే.. ఈ భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయంగా మారింది. 

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర ఉండాలని సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చిన విషయం తెలిసిందే. బీజేపేతర పార్టీలన్నింటీ ఒక్క తాటి మీదికి తీసుకవచ్చి.. ప్రధాని మోడీని గద్దే దించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. రానున్నది రైతు రాజ్యమనీ, కేంద్రంలోని బీజేపీని గద్దె దించి తీరుతామని దీమా బీఆర్ఎస్ వర్గాలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ విస్తరణపై బీఆర్ఎస్ వర్గాలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 
 
ఈ తరుణంలో నేడు రాజకీయపరంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే లు భేటీ అయ్యారు. వాస్తవానికి ఆదిత్య థాకరే మంగళవారం హైదరాబాద్‌లోని టీ హబ్ ను సందర్శించారు. ఈ తరుణంలో థాకరే.. కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలను కేటీఆర్, థాకరే చర్చించారు. ఈ క్రమంలో టీ హబ్ ప్రత్యేకత, వివరాలను మంత్రి కేటీఆర్ ని అడిగి ఆదిత్య థాకరే తెలుసుకున్నారు. అలాగే కేంద్రం పనితీరు, జాతీయ రాజకీయలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  

ఈ కీలక భేటీ అనంతరం ఆధిత్య ఠాక్రే ట్వీట్ చేస్తూ..  తాను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశానంటూ వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ను కలవటం చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చారు. సుస్థిరత, పట్టణీకరణ, సాంకేతికత వంటి అంశాలపై తామిద్దరం చర్చించుకున్నామని, భారత పురోగతిలో ఈ అంశాలు ముఖ్యమైనవని ఆదిత్య థాకరే తెలిపారు. టీ హబ్ లో జరుగుతున్న పనిని చూసి.. ఆదిత్య థాకరే ఆశ్చర్య పోయారు. టీ హబ్ అద్భుతమైనది. స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులకు టీహబ్ మంచి ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే.. మంత్రి కేటీఆర్‌తో మహారాష్ట్ర మాజీ సీఎం తనయుడు థాకరే భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే ఆసక్తికరంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే