టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసుకు సబంధించి ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించేందుకు అవకాశం కల్పించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈడీ.
హైదరాబాద్:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో డాక్యుమెంట్లను అందించాలని సిట్ కు ఈడీ లేఖ రాసింది. ఈ మేరకు మంగళవారంనాడు ఈడీ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిట్ అధికారులకు లేఖ రాశారు. మరో వైపు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించేందుకు అవకాశం కల్పించాలని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనల మేరకు ఈ ఇద్దరిని విచారించే అధికారం తమకు ఉందని ఈడీ అధికారులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, పబ్లిక్ డొమైన్ లో సమాచారం , ఇతరత్రా అంశాల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై ఈడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత మాసంలో ఫిర్యాదు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి విచారణ నిర్వహించనుంది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఇవాళ సిట్ అధికారులను కోరింది.
also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లో రంగంలోకి ఈడీ: శంకరలక్ష్మికి నోటీసులు
మరో వైపు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ శంకరలక్ష్మిని, పత్యనారాయణ అనే ఉద్యోగిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టుకు సిట్ అధికారులు స్టేటస్ రిపోర్టును అందించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించిన నివేదికను కోర్టుకు అందించింది సిట్ .