నేను అమ్ముడుపోయే రకం కాదు: అసద్

Published : Nov 21, 2018, 10:59 AM IST
నేను అమ్ముడుపోయే రకం కాదు: అసద్

సారాంశం

 తాను డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదని.. నిజాయితీగా బతుకుతున్నానని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.

హైదరాబాద్:  తాను డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదని.. నిజాయితీగా బతుకుతున్నానని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.

మంగళవారం రాత్రి  నిర్వహించిన ఓ సభలో ఆయన  ఈ విషయమై స్పందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో  ఎంఐఎం సభ నిర్వహించకుండా, ఆ సభలో తాను పాల్గొనకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రూ. 25 లక్షలు ఆఫర్ చేసినట్టుగా సోమవారం రాత్రి నిర్మల్ లో జరిగిన సభలో అసద్‌ ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలకు నిర్మల్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.తాను  అసద్ ను ఏనాడూ చూడలేదన్నారు. తాను అసద్ తో మాట్లాడినట్టు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. 

ఇదిలా ఉంటే ముథోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  భైంసా మున్సిఫల్ వైఎస్ ఛైర్మెన్, ఎంఐఎం నేతతో సంభాషించినట్టుగా సోషల్ మీడియాలో  ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. మంగళవారం నాడు రాత్రి  జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడారు.

తాను డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదన్నారు.తనపై  ఆరోపణలు చేయడం సరికాదని.. తాను ఎవరితో కుమ్మకయ్యానో ఆధారాలు ఉంటే రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాజకీయ, ధనబలంతో తనను ఎవరూ కూడ అణచివేయలేరని  ఆయన స్పష్టం చేశారు.ఎవరితో  కుమ్మక్కుకావాల్సిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

మజ్లిస్‌కు కాంగ్రెస్ రూ.25 లక్షల ఆఫర్ (ఆడియో)

అసద్‌కు మహేశ్వర్ రెడ్డి కౌంటర్: నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా

రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు


 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu