తెలంగాణలో ఎవరు గెలుస్తారు?..గూగుల్ లో హిట్ క్వొశ్చన్

By ramya neerukondaFirst Published Nov 21, 2018, 9:47 AM IST
Highlights

‘‘తెలంగాణాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు?’’ గడచిన 90 రోజులుగా గూగుల్ లో ఎక్కువమంది నెటిజన్లు సంధిస్తున్నదే ఈ ప్రశ్న. 

తెలంగాణ ఎన్నికలు ఇప్పుడు గూగుల్ ట్రెండింగ్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. 

అయితే.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు జరిగేదాక కూడా ఆగలేకపోతున్నారు. అందుకే గూగుల్ తల్లిని అడిగేస్తున్నారు.

‘‘తెలంగాణాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు?’’ గడచిన 90 రోజులుగా గూగుల్ లో ఎక్కువమంది నెటిజన్లు శోధిస్తున్న ప్రశ్న ఇదే. తెలంగాణాలో తెలంగాణ రాష్ట్రసమితి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు గూగుల్ ట్రెండ్స్ లో నిలిచాయి. 

సెప్టెంబరు 6వతేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శాసనసభను రద్దు చేస్తూ తీర్మానించినపుడు నెటిజన్లు టీఆర్ఎస్ పేరిట ఎక్కువగా శోధించారు. మొదట టీఆర్ఎస్ గురించి ఎక్కువగా శోధించిన నెటిజన్లు నవంబరు 1వతేదీకల్లా టీఆర్ఎస్ కు హిట్స్ తగ్గాయి. గత 20 రోజుల్లో గూగుల్ లో కాంగ్రెస్ గురించి ఎక్కువమంది నెటిజన్లు శోధించారని గూగుల్ ట్రెండ్స్ లో వెల్లడైంది. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ గురించి శోధించిన నెటిజన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీఅరేబియా, అమెరికా, సింగపూర్ దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఎక్కువమంది నెటిజన్లు తెలంగాణా ఎన్నికల గురించి గూగులమ్మను శోధించారని తేలింది.

 తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఏ రేవంత్ రెడ్డి గురించి ఎక్కువమంది నెటిజన్లు శోధించారని వెల్లడైంది. రేవంత్ రెడ్డి నియోజకవర్గం, ఆయన కుటుంబసభ్యుల గురించి కూడా ఎక్కువ నెటిజన్లు వెతకడం విశేషం. 

click me!