టీఆర్ఎస్ కి మరో షాక్...విశ్వేశ్వర్ రెడ్డి వెంటే మరో నేత

Published : Nov 21, 2018, 10:33 AM IST
టీఆర్ఎస్ కి మరో షాక్...విశ్వేశ్వర్ రెడ్డి వెంటే మరో నేత

సారాంశం

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగలనుంది. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగలనుంది. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఈ శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  కాగా.. ఆయన వెంటే మరో నేత టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు.

ఈ నెల 23న సోనియా గాంధీ తెలంగాణ  పర్యటను రానున్నారు. ఆమె సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వేశ్వర రెడ్డితోపాటు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా సిద్ధమయ్యారు. యాదవ రెడ్డితోపాటు.. ఆయన మద్దతు దారులు కూడా టీఆర్ఎస్ ని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో టీఆర్ఎస్ కి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో.. ఇలా ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని వీడటం టీఆర్ఎస్ నేతలను కలవరపెడుతోంది. ఈ ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై చూపెడుతుందేమోనని వారు భయపడుతున్నట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం