తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట వద్ద బావిలో 9 మంది వలస కూలీలు అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట వద్ద బావిలో 9 మంది వలస కూలీలు అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు.
Also Read:గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల ఘటనపై 9 టీములతో దర్యాప్తు: సీపీ రవీందర్
కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి.. అపస్మారక స్ధితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల విచారణలో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఆర్ధిక లావాదేవీలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో సంజయ్‌తో హత్య చేయించింది ఎవరే కోణంలో విచారిస్తున్నారు. అయితే మక్సూద్‌కు ఆర్ధిక ఇబ్బందులు లేవంటున్నారు పోలీసులు.. వరంగల్‌లో నాలుగు ఫ్లాట్స్‌కు మక్సూద్ యజమానిగా గుర్తించారు.
గీసుకొండ బావిలో 9 శవాల మిస్టరీ: అక్రమ సంబంధమే కారణమా?
పాషా, సంజయ్ కుమార్ బైక్‌పై వెళ్లిన సీసీ ఫుటేజీ పోలీసులకు కీలక ఆధారంగా లభించింది. విచారణలో భాగంగా నిందితుడి సహా మరో ఇద్దరిని విచారిస్తున్నారు పోలీసులు. మక్సూద్ కొడుకు బర్త్ డే సందర్భంగా హత్యలకు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. నిందితుడిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సమాచారం.
కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు మక్సూద్(55), అతడి భార్య నిషా (48), కుమార్తె బుస్రా (22), మూడేళ్ల మనవడు బబ్లూ మృతదేహాలను గురువారం రాత్రి వెలికితీశారు.
మక్సూద్ కుమారులు షాబాద్ అలం(21), సోహెల్ అలం(18) మృతదేహాలతో పాటు, బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం(21), శ్యాం(21), పశ్చిమబెంగాల్‌కు చెందిన షకీల్(30) మృతదేహాలు శుక్రవారం బావిలో కనిపించాయి. దీంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.