ఎంపీ అరవింద్‌ సర్టిఫికేట్‌‌పై వివాదం: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు

By Siva KodatiFirst Published May 24, 2020, 7:44 PM IST
Highlights

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పీజీ సర్టిఫికేట్‌‌పై వివాదం కొనసాగుతోంది. ఆయన ఎంఏ సర్టిఫికేట్ పొందిన రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఈ మేరకు సమాధానం వచ్చిందని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పీజీ సర్టిఫికేట్‌‌పై వివాదం కొనసాగుతోంది. ఆయన ఎంఏ సర్టిఫికేట్ పొందిన రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఈ మేరకు సమాధానం వచ్చిందని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:అవును, దేశద్రోహమే: సీఏఏపై కేసీఆర్ వ్యాఖ్యల మీద బిజెపి ఎంపీలు

దీనిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. అరవింద్ నకిలీ డిగ్రీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేయడం సరికాదని.. ఎవరు పరిశ్రమలను పెట్టినా సహకరించాలని జగ్గారెడ్డి హితవు పలికారు.

ఉత్తమ్‌పై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని.. పసుపు రైతులను అరవింద్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎఎస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. దొంగ సర్టిఫికెట్లు సృష్టించడంలో అరవింద్ దిట్టని.. మోసపూరిత హామీలతో ఆయన ఎన్నికల్లో గెలిచారని ఆయన మండిపడ్డారు.

Also Read:కేసీఆర్ రాష్ట్రానికి శనిలా దాపురించాడు..: ఎంపీ అరవింద్ ఫైర్

ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎంపీ అరవింద్ నెరవేర్చలేదన్నారు. అరవింద్ దొంగ సర్టిఫికెట్‌తో ఎంపీగా చెలామణి అవుతున్నారని మన్నె క్రిశాంక్ అన్నారు. రాజస్థాన్‌ యూనివర్సిటీలో చదవలేదని వర్సిటీ రిప్లై ఇచ్చిందని.. అరవింద్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో కేసు వేస్తున్నామని స్పష్టం చేశారు. 

click me!