హైద్రాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం:లక్డీకపూల్ లో నిలిచిపోయిన రైలు

Published : Nov 11, 2022, 11:44 AM ISTUpdated : Nov 11, 2022, 12:13 PM IST
హైద్రాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం:లక్డీకపూల్ లో  నిలిచిపోయిన రైలు

సారాంశం

హైద్రాబాద్ నగరంలో మెట్రో రైలులో సాంకేతిక లోపంతో 15నిమిషాల పాటురైలు నిలిచిపోయింది. లక్డీకపూల్ లో రైలు ఆగిపోయింది.

హైదరాబాద్:నగరంలోని లక్డీకపూల్ లో 15 నిమిషాలపాటు మెట్రోరైలు నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే మెట్రో రైలు నిలిచిపోయిందని సమాచారం.గతంలో కూడా  టెక్నికల్ సమస్యలతో రైళ్లు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2019 నవంబర్ 20న సాంకేతిక సమస్యతో రైలు నిలిచిపోయింది. అమీర్ పేట ,బేగంపేటస్టేషన్ల మధ్య రైలు ఆగిపోయింది. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్ నుండి నిప్పు రవ్వలు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణీకులు రైలును దిగి నడుచుకంటూతమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.ఈ ఘటనతో నాగోల్ -హైటెక్ సిటీ  మార్గంలో మెట్రోరైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 2021 జనవరి 20న కూడా సాంకేతిక సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయిన ఘటన చోటు  చేసుకుంది.అమీర్ పేట నుండి జూబ్లీహిల్స్  బస్ స్టేషన్ వెళ్లే మార్గంలో 15 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది.దీంతో హైటెక్ సిటీ నుండి జూబ్లీహిల్స్ కు మరో రైలులో ప్రయాణీకులను తరలించారు. 

ఈ ఏడాది మార్చి24న హైద్రాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది.దీంతో రైలు నిలిచిపోయింది.ఎల్‌బీనగర్ నుండి మియాపూర్ వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య ఏర్పడడంతో మూసారాంబాగ్ రైల్వేస్టేషన్ వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది.దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది.సాంకేతిక సమస్యలను అధికారులు సరిచేసిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 16న మెట్రో రైలులో టెక్నికల్ సమస్యలతో రైలు నిలిచిపోయింది.మియాపూర్ ఎల్బీనగర్ రూట్ లో మెట్రో రైలులో 20 నిమిషాలు  నిలిచి పోయింది.అసెంబ్లీ వద్ద రైలు నిలిచిపోయింది.టెక్నికల్ సమస్యను పరిష్కరించి అధికారులు రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు.కరోనా లాక్ డౌన్  హైద్రాబాద్ మెట్రోపై  తీవ్ర ప్రభావంచూపింది.లాక్ డౌన్ తర్వాత  కాలంలో మెట్రో రైలు సేవలను పునరుద్దరించిన తర్వాత ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. హైద్రాబాద్ మెట్రో రైలు సమయాల్లో కూడా అధికారులు మార్పులు చేశారు. విధులకు హాజరయ్యేవారికి అనుగుణంగా ట్రైన్ వేళల్లో మార్పులు చేర్పులు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్