మొయినాబాద్ ఫాంహౌస్ కేసు:నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ లో ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డింగ్

By narsimha lode  |  First Published Nov 11, 2022, 10:18 AM IST

మొయినాబాద్ పాం హౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో అరెస్టైన నిందితుల వాయిస్ ను పోలీసులు  ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రికార్డు చేయనున్నారు.ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ సంభాషణలోని ఆడియోతో ఈ వాయిస్ ను పోల్చనున్నారు.


హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ లో  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు పోలీసులు వాయిస్ రికార్డిం చేయనున్నారు.నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ లో శుక్రవారంనాడు పోలీసులు నిందితుల వాయిస్ ను రికార్డ్ చేస్తారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలతో అరెస్టైన రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను వాయిస్ లను పోలీసులు రికార్డింగ్ చేయనున్నారు. ఇవాళ చంచల్ గూడ జైలు  నుండి నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కు తరలించారు పోలీసులు. ఎఫ్ఎస్ఎల్ ఈ ముగ్గురు నిందితుల వాయిస్ ను రికార్డు చేసిన  తర్వాత  ఈ వాయిస్ ను సరిపోల్చనున్నారు. 

ఎమ్మెల్యేలతో నిందితులు చేసిన ఫోన్ సంభాషణతో పాటు వీడియో సంభాషణలో ని వాయిస్ ను పోల్చిచూడనున్నారు. ముగ్గురు నిందితులు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియో, వీడియో బయటకువచ్చిన విషయం తెలిసిందే ఈ ఆడియో, వీడియోలను పోలీసులు కోర్టుకు సమర్పించాయి.మరో వైపు ఈ  ఆడియో,వీడియోలను  కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. 

Latest Videos

alsoread:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై విచారణకు సిట్:హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్

గత  నెల 26 వతేదీన మొయినాబాద్ పాంహౌస్ లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల విచారణపై ఉన్నస్టేను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది.అంతేకాదు నిందితులను కస్టడీకి ఇచ్చింది. దీంతో నిన్నటి నుండి నిందితులను పోలీసుులు   తమ  కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న   ఏడు గంటల పాటు నిందితులను విచారించారు. ఇవాళ సాయంత్రం వరకు విచారించిన తర్వాత నిందితులను పోలీసులు జైలుకు తరలించనున్నారు.

నిందితుల  విచారణకు రాష్ట్రప్రభుత్వం సిట్ ను ఏర్పాటుచేసింది.సిట్ దర్యప్తుతోపాటు విచారణను కూడా నిలిపివేయాలనికోరుతూ బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణను సిట్టింగ్  జడ్జి లేదా  సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ డిమాండ్ తో గత నెల 27న పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్ పై విచారణ ఈనెల 14కి హైకోర్టు  వాయిదా వేసింది.అయితే  సిట్ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ బీజేపీ  నిన్న పిటిషన్ దాఖలు చేసింది.
 

click me!