Hyderabad: రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రెండు విడతల్లో రుణమాఫీ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తోందనీ, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. అలాగే, 'వారు మహాత్మా గాంధీని చంపిన గాడ్సే శిష్యులు. మేము గాంధీ అనుచరులం' అంటూ విమర్శలు గుప్పించారు.
Telangana Minister and BRS Working President KTR: రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రెండు విడతల్లో రుణమాఫీ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తోందనీ, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. అలాగే, 'వారు మహాత్మా గాంధీని చంపిన గాడ్సే శిష్యులు. మేము గాంధీ అనుచరులం' అంటూ విమర్శలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్ ) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కొందరు నేతలు ఢిల్లీలో కూర్చొని స్వచ్ఛభారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ్ దట్ అంటూ నినాదాలు చేస్తున్నారన్నారు. కానీ దానికి సంబంధించిన పని పెద్దగా ఉండదనీ, పేరు కోసం అక్కడక్కడా గాంధీజీని స్మరించుకుంటూ ఫొటోలు దిగే కార్యక్రమాలు మాత్రమే చేస్తారంటూ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే, తాము స్వచ్ఛతపై జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ తెలంగాణను చేపట్టామని చెప్పారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. స్వచ్ఛ భారత్ అనేది భాగస్వామ్య బాధ్యత అనీ, ప్రతి ప్రయత్నం ముఖ్యమని అన్నారు.
అంతకుముందు, రుణమాఫీపై ప్రధాని తప్పుడు ప్రకటన చేస్తున్నారనీ, తెలంగాణ ప్రభుత్వం రెండు విడతల్లో రూ.37,500 కోట్ల రుణాలను మాఫీ చేసిన విషయం ఆయనకు (మోడీ) తెలియదన్నారు. బీజేపీ హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తోందని, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందన్నారు. వారు మహాత్మాగాంధీని చంపిన గాడ్సే శిష్యులని పేర్కొన్న ఆయన తాము గాంధీ అనుచరులమని చెప్పారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన కేటీఆర్.. ఎలాంటి గ్యారంటీ లేని హామీలు ఉన్న పార్టీ అది. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే వారిని ప్రజలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దామరచర్లలో నిర్మిస్తున్న 4 వేల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మూసివేసేలా ఆ పార్టీ నేతలు చూస్తారు. వ్యవసాయానికి కేవలం మూడు గంటల కరెంట్ మాత్రమే అందిస్తారు.. ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు ఉంటారని ఎద్దేవా చేశారు.