మరికొన్ని రోజుల్లో కూతురి పెళ్లి: లండన్‌లో హత్యకు గురైన హైద్రాబాద్ వాసి

Published : Oct 03, 2023, 11:22 AM ISTUpdated : Oct 03, 2023, 11:25 AM IST
మరికొన్ని రోజుల్లో కూతురి పెళ్లి: లండన్‌లో హత్యకు గురైన హైద్రాబాద్ వాసి

సారాంశం

హైద్రాబాద్‌కు చెందిన రైసుద్దీన్ అనే వ్యక్తి లండన్ లో దారుణ హత్యకు గురయ్యాడు.  కూతురి పెళ్లి కోసం హైద్రాబాద్ వస్తున్న సమయంలో ఈ హత్య చోటు చేసుకుంది.

హైదరాబాద్: లండన్ లో హైద్రాబాద్ కు చెందిన రైసుద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.హైద్రాబాద్ కు చెందిన రైసుద్దీన్ ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. రైసుద్దీన్ కూతురు పెళ్లి నిశ్చయించారు. కూతురు పెళ్లి కోసం హైద్రాబాద్ కు వచ్చే సమయంలో దుండగులు రైసుద్దీన్ పై దాడి చేసి దోచుకున్నారు. దుండగుల దాడిలో రైసుద్దీన్ మృతి చెందాడు.రైసుద్దీన్ వద్ద ఉన్న నగదును దుండగులు దోచుకున్నారని సమాచారం అందింది. రైసుద్దీన్ మృతదేహన్ని హైద్రాబాద్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

కూతురి పెళ్లికి రైసుద్దీన్ కుటుంబ సభ్యులు  ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ తరుణంలో రైసుద్దీన్ మృతి చెందినట్టుగా  కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.దీంతో వారంతా షాక్ కు గురయ్యారు.  రైసుద్దీన్ మృతదేహన్ని త్వరగా హైద్రాబాద్ రప్పించాలని కోరుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం