CM KCR: ఆ విష‌యంలో త‌గ్గేదేలే.. సీఎస్ కు దిశా నిర్దేశం

By Rajesh K  |  First Published Jan 4, 2022, 5:49 AM IST

Pending Bifurcation Issues: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, విభజన అంశాలకు సంబంధించి చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. జ‌న‌వ‌రి 12న కేంద్ర హోంశాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే.. సమావేశంపై  సీఎస్ సోమేశ్ కుమార్ ​కు దిశానిర్దేశం చేసిన సీఎం.. చట్టంలోని అంశాలకు ఏపీ కట్టుబడి ఉంటేనే సహకరించాలని స్పష్టం చేశారు.  ఆ కారణంగానే ఇప్పటికే పరిష్కారం కావాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు.


Pending Bifurcation Issues: తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ప్ర‌తి అంశానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనవరి 12న కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌​కు దిశానిర్దేశం చేసిన సీఎం.. చట్టంలోని అంశాలకు ఏపీ కట్టుబడి ఉంటేనే సహకరించాలని స్పష్టం చేశారు. కేంద్రం ముందు త‌మ వాదనలు వినిపించాలని  సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ కోరారు. 
 
పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష నిర్వహించనున్నారు. ఇంకా పెండింగ్​లో ఉన్న అంశాలు, ఇబ్బందులు, పరిష్కారం కోసం... తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కేంద్ర హోంశాఖ సమావేశంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎస్ సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

READ ALSO ; CM KCR: భయపడొద్దు కానీ, జాగ్రత్త ఉండండి.. క‌రోనా వ్యాప్తిపై సుధీర్ఘ స‌మీక్ష‌

Latest Videos

undefined

విభజన చట్టంలో లేని అంశాలను లేవనెత్తుతూ ఆంధ్రప్రదేశ్ అనవసర వివాదాలు సృష్టిస్తోందని, విభజన చట్టానికి వ్యతిరేకంగా సింగరేణి లాంటి సంస్థల్లో వాటా కావాలని గొంతెమ్మ కోరికలు కోరడం వంటి అసంబద్ధ డిమాండ్‌లను కేంద్రం దృష్టికి తీసుక‌పోవాల‌ని సూచించారు. విడిపోయి ఏడేండ్లు అయినా..  అనేక విభజన సమస్యలు ఏడేళ్ల తర్వాత కూడా పెండింగ్‌లో ఉన్నాయని వాటి గురించి మాట్లాడాలని తెలిపారు. ఏపీవి అన్ని గొంతెమ్మ కోరికలు..విభజన అంశాలు, సమస్యలు, వాటి ప్రస్తుత స్థితిని అధికారులు సీఎంకు వివరించారు. 

READ ALSO ;  ఒమిక్రాన్.. సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమే.. కానీ, జాగ్రత్తగా ఉండాలి: యూపీ సీఎం యోగి

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పట్ల ఏపీ ప్రభుత్వం నిబద్ధత వ్యక్తం చేస్తేనే చర్చలకు ఏపీకి సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తెలంగాణ నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని స్ప‌ష్టంచేయాలనిసీఎస్​ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని అంశాలపై గతంలో అనుసరించిన విధంగానే అమ‌లుచేయాలని కోరారు. జనవరి 12 వరకు కోవిడ్ పరిస్థితుల ఆధారంగా సమావేశానికి హాజరు కావడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

click me!