ఖమ్మం: ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్... ప్రాణాలమీదకు తెచ్చిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

By Arun Kumar PFirst Published Sep 26, 2021, 12:38 PM IST
Highlights

వైద్యసిబ్బంది నిర్లక్యం ఓ వృద్ధురాలి ప్రాణాలమీదకు తెచ్చింది. ఒకేసారి రెండుడోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో మహిళ తీవ్ర అస్వస్థతకు గురయి హాస్పిటల్ పాలయ్యింది. 

ఖమ్మం: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా నుండి కాపాడాల్సిన వ్యాక్సిన్ (Corona Vaccine) ఓ వృద్ధురాలి ప్రాణాలమీదకు తెచ్చింది. శనివారం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వృద్ధురాలు హాస్పిటల్ పాలయ్యింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మొదట్లో బయపడిన ప్రజలు కూడా కరోనా నుండి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని గ్రహించారు. దీంతో 18ఏళ్లు నిండిన యువత నుండి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇలా వ్యాక్సిన్ వేయించుకోడానికి వచ్చిన ఓ వృద్ధురాలిని కరోనా నుండి  కాపాడటం అటుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ నర్స్ ప్రాణాలమీదకు తెచ్చింది.  

read more  తెలంగాణ: కొత్తగా 248 కరోనా కేసులు.. 6,64,898కి చేరిన మొత్తం సంఖ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెంకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలు బానోత్‌ సక్రీని కుటుంబసభ్యులు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే వ్యాక్సిన్ కేంద్రంలో పనిచేసే నర్స్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్ లో మాట్లాడుతూనే టీకా ఇచ్చింది. ఒకసారి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన విషయాన్ని ఫోన్ లో మాట్లాడుతూ మరిచిపోయిన సదరు నర్స్ రెండో డోస్ కూడా ఇచ్చింది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు రెండు డోసులు ఒకేసారి ఇవ్వడమేంటని నిలదీశారు. 

ఇలా రెండు డోసుల వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడంతో సదరు  వృద్దురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో అక్కడే వైద్యం అందించారు వైద్య సిబ్బంది. ఇలా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఆరోగ్యంగా వున్న ఓ వృద్దురాలిని హాస్పిటల్ పాలు చేసింది. 
 

click me!