అమృతను వద్దని చెప్పలేదు: మారుతీరావు తమ్ముడు శ్రవణ్ క్లారిటీ

Published : Mar 09, 2020, 10:43 AM ISTUpdated : Mar 09, 2020, 11:05 AM IST
అమృతను వద్దని చెప్పలేదు: మారుతీరావు తమ్ముడు శ్రవణ్ క్లారిటీ

సారాంశం

మారుతీరావును కడసారి చూసేందుకు అమృత వర్షిణిని అనుమతించలేదనే వార్తలను శ్రవణ్ ఖండించారు. మారుతీ రావు తమ్ముడు శ్రవణ్ అమృతను రావద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

మిర్యాలగుడా: తన సోదరుడు మారుతీరావును కడసారి చూసేందుకు తాను ఆయన కూతురు అమృత వర్షిణిని వద్దని చెప్పినట్లు వచ్చిన వార్తలపై శ్రవణ్ స్పష్టత ఇచ్చారు. తన తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు అమృత వర్షిణి అనుమతి కోరినట్లు, శ్రవణ్ అందుకు ఒప్పుకోనట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని శ్రవణ్ అన్నారు. 

తాను రావద్దని అమృతకు చెప్పలేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తండ్రిని చివరిసారి చూస్తానని చెప్పడానికి అమృత తమను స్పందించలేదని ఆయన చెప్పారు. విషమంతా శరీరంలోకి పాకడం వల్ల మారుతీ రావు మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక నివేదికలో తేలింది. గారెల్లో విషం కలుపుకుని తినడం వల్లనే మారుతీ రావు మరణించినట్లు తెలుస్తోంది.

Also Read: విషమే మిస్టరీ: మారుతీ రావు మృతిపై తేల్చేసిన నిపుణులు

మారుతీ రావు అంత్యక్రియలకు మిర్యాలగుడాలోని శ్మశానవాటికలో అన్ని ఏర్పాటు జరిగాయి. తన తండ్రిని కడసారి చూసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, అందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అమృత కోరినట్లు చెబుతున్నారు. 

మారుతీరావు హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గల ఆర్యవైశ్య భవన్ లోని గదిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మారుతీ రావు కూతురు అమృత దళిత యువకుడు ప్రణయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మారుతీ రావును కాదని ఆ పనిచేసింది. దాంతో కక్ష కట్టిన మారుతీ రావు ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించాడు. 

Also Read: రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ సినిమా "అమృత - మారుతీరావుల" ఎపిసోడేనా?

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?