ఆ ప్రియురాలి కోరికలు చాలా కాస్ట్లీ.. నాకు నా భార్యే కావాలి.. పోలీసులను ఆశ్రయించిన భర్త....

Published : Apr 18, 2022, 09:09 AM IST
ఆ ప్రియురాలి కోరికలు చాలా కాస్ట్లీ.. నాకు నా భార్యే కావాలి.. పోలీసులను ఆశ్రయించిన భర్త....

సారాంశం

ప్రియురాలి మోజులో పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకున్నాడు. భార్యా, పిల్లల్ని వదిలేసి ప్రియురాలితో లేచిపోయాడు. ఆ తరువాతే అసలు విషయం బోధపడింది. ఆమె గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక ఒక్క నెలలో పది లక్షలు అప్పుకావడంతో లబోదిభోమంటూ భార్య దగ్గరికి తిరిగొచ్చాడు.. కానీ... 

హైదరాబాద్ : ప్రియురాలి ఆకర్షణలో చిక్కిన ఓ ప్రబుద్ధుడు భార్య పిల్లల్ని వదిలేసి ఆమెతో వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత వాస్తవం బోధపడి.. కట్టుకున్న భార్యే ముద్దంటూ.. ఎలాగైనా తమను కలపాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఆ భార్య మాత్రం ఇతగాడితో ఉండలేనంటూ తేల్చి చెప్పింది. కూకట్పల్లికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు. ఆర్థికంగా లోటు లేని జీవితం. ఇద్దరు పిల్లలతో సజావుగా సాగుతున్న సంసారం. గతేడాది భర్తకు ఓ వివాహితతో పరిచయమైంది.సెల్ఫోన్లో గంటలకొద్దీ మాటలు.. వాట్సాప్ లో అర్ధరాత్రి దాటాక చాటింగ్ లు.. వెరసి 2 నెలల క్రితం ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అతడి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అసలు విషయం బయటపడింది. తండ్రి ఎక్కడ అంటూ పిల్లలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె మౌనం వహిస్తూ ఉండే.ది ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఢిల్లీ వెళ్లడని చెబుతూ వచ్చింది.  కొద్దిరోజుల క్రితం అతడు అకస్మాత్తుగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తాను అదృశ్యం అవ్వలేదని క్షణికావేశంలో తప్పు చేశానంటూ ఖాకీల కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఏదో విధంగా భార్యతో కలిసి బతికేలా చూడమంటూ ప్రాధేయపడ్డాడు.

అతడికి జ్ఞానోదయం కలగడానికి కారణం ఏంటా అని ఆరా తీయగా అతను ఇచ్చిన సమాధానం విని పోలీసు అధికారి విస్తుపోయారు. ప్రియురాలు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని ఖరీదైనవే కావాలనేదట. విలాసవంతమైన జీవితం ఆస్వాదించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టించడం ప్రారంభించింది. ఆహారం, దుస్తులు, వస్తువులు రోజువారి గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు నెలరోజుల్లోనే 10 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందంటూ బోరు మన్నాడట. 

ఖర్చులు భరించలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. పెద్దల ద్వారా భార్యతో రాజీ కుదుర్చుకుందామని ప్రయత్నిస్తే ఆమె ఛీకొట్టింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నాడు. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి  కలిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ లో మహబూబ్ నగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తికి తన దగ్గర అప్పు తీసుకున్న మహిళతో extramarital affair ఏర్పడింది. ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడం కోసం అతను అమలు చేసిన ప్రణాళిక ఓ క్రైం సినిమాను తలపిస్తుంది. Mahabubnagar డిఎస్ పి కిషన్ ఎప్రిల్ 9న జడ్చర్లలో విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మండలం బూరుగుపల్లికి చెందిన శ్రీశైలం (29)కి తొమ్మిదేళ్ల కిందట హైదరాబాదులోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన సంగీతతో వివాహం అయ్యింది. ఈమె తల్లి నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గ్రామానికి చెందిన వెంకటమ్మ. ఆమె సుమారు 20 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వెళ్లి జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తోంది.

2016లో శ్రీశైలం జీవనోపాధి కోసం భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి హైదరాబాద్ కు వెళ్ళాడు. ఎల్బినగర్ రత్నానగర్ లో అద్దె ఇంట్లో ఉంటూ కారు డ్రైవర్ గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య సంగీత ఎదురింట్లో ఉండే విక్రమ్ వద్ద రూ. 50 వేలు అప్పు తీసుకుంది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.  విషయం తెలిసిన శ్రీశైలం మందలించినా భార్య ప్రవర్తన లో మార్పు రాకపోవడంతో.. కుటుంబాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రియురాలు, తన స్నేహితుడి సహాయంతో.. ఆమె భర్తను ప్రియుడు పథకం ప్రకారం హత్య చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!