ముగిసిన పోలీస్ కస్టడీ: హయత్ నగర్ కోర్టుకు సస్పెన్షన్ గురైన సీఐ నాగేశ్వరరావు

By narsimha lode  |  First Published Jul 22, 2022, 4:38 PM IST

 ఐదు రోజుల కస్టడీ ముగియడంతో సస్పెన్షన్ కు గురైన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్టయ్యాడు మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు. ఈ కేసు నమోదైన తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది



హైదరాబాద్: సస్పెన్షన్ కు గురైన మారేడ్‌పల్లి సీఐ  నాగేశ్వర్ రావు పోలీసుల కస్టడీ ముగిసింది. ఐదు రోజుల పాటు  ఈ నెల 18వ తేదీన Nageswara Raoను పోలీసుల కస్టడీకి Hayathnagar కోర్టు అనుమతిని ఇచ్చింది. ఐదు రోజుల పాటు సస్పెన్షన్ కు గురైన సీఐ నాగేశ్వరరావును పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.  కోర్టు అనుమతించిన కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు ఇవాళ మధ్యాహ్నం ఆయనను హయత్ నగర్  కోర్టులో హాజరుపర్చారు.

. ఈ నెల 7వ తేదీన రాత్రి Hyderabad నగరంలోని హస్తినాపురంలో గల బాధితురాలి ఇంటికి వెళ్లి నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. రివాల్వర్ కణతకు పెట్టి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

Latest Videos

undefined

ఆ సమయంలో బాధితురాలి భర్త ఇంటికి చేరుకున్నాడు.బాధితురాలి భర్తను కూడా తుపాకీతో బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. వీరిద్దరిని తన కారులో తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లే సమయంలో ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ రోడ్డు ప్రమాదంతో  తాము తప్పించుకుని వచ్చి వనస్థలిపురం పోలీసులకు  బాధితులు ఫిర్యాదుచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ కేసు నమోదు కావడంతో నాగేశ్వరరావుపై సస్పెన్షన్ ను విధిస్తూ హైద్రాబాద్ సీపీ  ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టైన నాగేశ్వరరావును రిమాండ్ కు తరలించారు.

ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. అంతేకాదు సీన్ రీకన్ స్ట్రక్షన్ కూడా నిర్వహించారు. ఈ కేసు విషయమై విపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఐ నాగేశ్వరరావుకు ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

also read:సస్పెన్షన్ కు గురైన సీఐ నాగేశ్వరరావును కాపాడడం లేదు: రాచకొండ సీపీ మహేష్ భగవత్

నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కూడా కీలక విషయాలు వెలుగు చూశాయి. వివాహితపై కుటుంబంపై చాలా కాలంగా నాగేశ్వరరావు కన్నేశాడు. బాధితురాలి భర్త ఇంట్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడనే విషయమై కూడ సీఐ మొబైల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొనేవాడని ఈ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగానే వివాహిత ఇంటికి నాగేశ్వరరావు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

బాధితులకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారి  వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటన  తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత మిర్యాలగూడ కు చెందిన ఓ యువతి కూడా విజయ్ అనే ఎస్ఐపై కూడా ఫిర్యాదు చేసింది. తనపై ఎస్ఐ అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పిర్యాదు చేసింది. దీంతో  ఎస్ఐ విజయ్ ను సస్పెండ్ చేశారు రాచకొండ సీపీ మహేష్ భగవత్ . ఇదే తరహాలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువతిపై వేధింపులకు పాల్పడినట్టుగా ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి.

click me!