పే స్కేల్, ప్రమోషన్ కోసం వీఆర్ఏల ఆందోళన.. కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత, సిరిసిల్లలో ఉద్రిక్తత

By Siva Kodati  |  First Published Jul 22, 2022, 4:31 PM IST

పే స్కేల్, ప్రమోషన్‌లు కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీఆర్ఏలు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ఆందోళన నిర్వహించారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను వీఆర్ఏలు అడ్డుకున్నారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అటు వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్, ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను కాల్చిపారేస్తానన్న సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!