Fake Doctor Arrested: ఎల్బీనగర్ లో నకిలీ డాక‌ర్ట్ అరెస్ట్..  రష్యా విశ్వవిద్యాలయం నుంచి ఫేక్ సర్టిఫికేట్ !

Published : Jul 22, 2022, 03:53 PM IST
Fake Doctor Arrested:  ఎల్బీనగర్ లో నకిలీ డాక‌ర్ట్ అరెస్ట్..  రష్యా విశ్వవిద్యాలయం నుంచి ఫేక్ సర్టిఫికేట్ !

సారాంశం

Fake Doctor Arrested: హైద‌రాబాద్ నగ‌రంలో డాక్ట‌ర్ గా చ‌లామ‌నీ అవుతున్న‌ నకిలీ వైద్యుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎండీ ఫిజియోగా  పని చేస్తున్న ఆయ‌న  రష్యా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ చేసినట్టు నకిలీ సర్టిఫికేట్‌ తెచ్చుకొని విధులు నిర్వర్తిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.  

Fake Doctor Arrested: హైదరాబాద్ న‌గ‌రంలో డాక్టర్‌గా చలామణి అవుతున్న నకిలీ డాక్ట‌ర్ ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. న‌గ‌రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ న‌కిలీ డాక్ట‌ర్ ఎండీ ఫిజియోగా పని చేస్తున్నాడు. Fake డాక్ట‌ర్  రష్యా యూనివర్సిటీ నుంచి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తెచ్చుకున్న‌ట్టు పోలీసుల‌కు సమాచారం అందింది. ఈ క్ర‌మంలో  ఫేక్ డాక్ట‌ర్ పై పోలీసులు దాడులు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  ఆ  న‌కిలీ డాక్టర్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ స‌మ‌యంలో  ఫేక్ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికెట్‌తో పాటు ఇత‌ర స్టాంపులు, ఓ కారు, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విష‌యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్ర‌ధాన నిందితుడు కుడిలేటి విజయ్ కుమార్ సూర్యాపేట‌ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవాడు. 2014లో ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా B.Sc లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆ త‌రువాత కొంత కాలం ప‌లు ఆసుపత్రులలో కాంపౌండర్/ PRO గా పనిచేశాడు. వైద్యరంగంలోనే సిర్థ ప‌డాల‌ని, ఎలాగైనా నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు సంపాదించాలని భావించాడు. 

రెండేళ్ల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా హాస్పిటల్‌లో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు అఫ్రోజ్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యంతో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరాడు. ఈ క్ర‌మంలో అఫ్రోజ్ తన స్నేహితుడు మహబూబ్ అలీ జునైద్‌ను ప‌రిచ‌యం చేశాడు.  విజయ్ కుమార్‌కు ఎంబీబీఎస్ సర్టిఫికెట్ అవసరమని తెలియజేశాడు. నకిలీ MBBS సర్టిఫికేట్ అందించినందుకు 8 లక్షలు కావాలి అఫ్రోజ్‌తెలిపారు. ఫైన‌ల్ గా రూ. 6,50,000/- చెల్లించి, రష్యాలోని కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుండి నకిలీ MBBS & ఇతర సర్టిఫికేట్లను పొందాడు.

నకిలీ సర్టిఫికేట్‌ను ఉపయోగించి విజయ్ కుమార్ COVID-19 కాలంలో  6 నెలల పాటు ఉప్పల్‌లోని లైఫ్ కేర్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పని చేసి.. నెలకు రూ.60,000/- జీతం పొందారు. అనంత‌రం ప‌ని మానేశాడు.  గ‌త 6 నెల‌ల కిత్రం మంద మల్లమ్మ ఎక్స్ రోడ్స్ సమీపంలోని ఆర్కే హాస్పిటల్‌లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా, (ఎండీ) ఫిజీషియన్‌గా పని చేస్తూ అమాయక రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో  విజ‌య్ కూమార్ పై పోలీసులకు ఫిర్యాదు అంద‌డంతో రంగంలో దిగారు. గ‌త కొద్ది రోజుల పాటు నిఘా పెట్టి.. గురువారం సాయంత్రం అత‌ని ఆస్పత్రిపై  రాచ‌కొండ పోలీసులు సోదాలు నిర్వ‌హించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu