మరియమ్మ కస్టోడియల్ డెత్: సర్వీస్ నుండి ముగ్గురు పోలీసుల తొలగింపు

By narsimha lodeFirst Published Jul 21, 2021, 9:34 AM IST
Highlights

యాదాద్రి భువనగరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ కు కారణమైన ముగ్గురు పోలీసులను సర్వీస్ నుండి తొలగిస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్:  యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో  కస్టోడియల్ డెత్ కు గురైన మరియమ్మ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. ముగ్గురిని సర్వీస్ నుండి  తొలగిస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్  ఉత్తర్వులు జారీ చేశారు.ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ ఆమె కొడుకు ఉదయ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చిలో పనిచేసేవారు.  అయితే చర్చిలో పనిచేసే సమయంలో  డబ్బులు పోయాయని చర్చి ఫాదర్  ఫిర్యాదు మేరకు  ఈ ఏడాది జూన్ 18వ తేదీన  ఉదయం 7:45 గంటలకు మరియమ్మతో పాటు ఆమె కొడుకు ఉదయ్, అతని స్నేహితుడు శంకర్ లను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.

also read:మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం

 పోలీసులు కొట్టిన దెబ్బలకు తన తల్లి మరియమ్మ తన చేతిలోనే చనిపోయిందని ఉదయ్ ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీజీపికి ఈ విషయాన్ని ఆయన తెలిపారు.మరియమ్మ కస్టోడియల్ డెత్  అంశాన్ని సీఎల్పీ నేత మల్లు  భట్టి విక్రమార్క  పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై ఇప్పటికే  ఎస్ఐ మహేశ్వర్, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్  మంగళవారం నాడు  ఉత్తర్వులు జారీ చేశారు.
 

click me!