మైనర్ బాలుడిపై అత్యాచారం, హత్య.. దోషికి జీవితఖైదు

Published : Jul 21, 2021, 08:10 AM ISTUpdated : Jul 21, 2021, 08:18 AM IST
మైనర్ బాలుడిపై అత్యాచారం, హత్య.. దోషికి జీవితఖైదు

సారాంశం

బాలుడు గట్టిగా కేకలు వేయడంతో... వెంటనే నేలకేసి కొట్టాడు. దీంతో... తలకు తీవ్రమైన గాయం కావడంతో.. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  

ఏడేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతి కిరాతకంగా హత్య చేశాడు. కాగా.. ఆ బాలుడిని చంపిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్  పరిధిలోని జల్ పల్లి న్యూ హుడా కాలనీకి చెందిన ఒమర్ బిన్ వ్యసనాలకు అలవాటు పడి ఆకతాయిలా తిరిగేవాడు.

కిరాణా షాపుకు వెళ్తున్న బాలుడిని ఒమర్ బిన్ చాక్లెట్ ఆశ చూపించి ఎత్తుకెళ్లాడు. సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, బాలుడిపై లైంగిక దాడి చేశాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో... వెంటనే నేలకేసి కొట్టాడు. దీంతో... తలకు తీవ్రమైన గాయం కావడంతో.. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కాగా.. బాలుడి అరుపులు విన్న స్థానికులు అక్కడికి పరుగున వచ్చారు. అప్పటికే బాలుడు చనిపోయి కనిపించాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన 2019 మే 8న చోటుచేసుకుంది. కాగా.. బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిని పట్టుకోగలిగారు. తాజాగా.. నిందితుడికి న్యాయస్థానం  జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu