మాజీ సర్పంచ్ ను దారుణ హత్య చేసిన మావోయిస్టులు..ఇన్ ఫార్మర్ నెపంతో.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చి..

Published : Dec 23, 2021, 06:37 AM IST
మాజీ సర్పంచ్ ను దారుణ హత్య చేసిన మావోయిస్టులు..ఇన్ ఫార్మర్ నెపంతో.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చి..

సారాంశం

రమేష్ ను వెంకటాపురం ఎస్సై జి. తిరుపతి ఇన్ ఫార్మర్ గా మార్చారు. మేం అడిగే సామాగ్రిని అతనితో పంపుతూ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మా కదలికలను గుర్తించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విషయం కలిపిన పాలపొడిని మాకు సరఫరా చేశారు. దాన్ని తాగిన దళ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. ఓ మావోయిస్టు మ్యాదరి భిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యారు. మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసి పోలీసుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. ప్రజాభిప్రాయం మేరకు అతన్ని చంపుతున్నాం

వెంకటాపురం : తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు దండకారణ్యంలో Maoists ఘాతుకానికి పాల్పడ్డారు. Informer నెపంతో రెండు రోజుల క్రితం అపహరించిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం కె. కొండాపురానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త, former sarpanch కొర్స రమేష్ (33)ను హత్య చేశారు. జిల్లా సరిహద్దులోని ప్రధాన మార్గానికి 8 కి.మీ. దూరంలో ఉన్న State of Chhattisgarh కొత్తపల్లి శివారు ఇన్నర్ రోడ్ పై dead bodyని పడేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 

కొంతకాలంగా ఏటూరునాగారంలో నివాసం ఉంటున్న కొర్స రమేష్ ఈ నెల 20న టూ వీలర్ మీద వెంకటాపురం మండలం తిప్పాపురానికి చెందిన స్నేహితుడు కుర్సం  రమేష్ తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రం భీమారం వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు తనతో మాట్లాడాలని పిలిచినట్టు భార్యకు చెప్పారు. అక్కడ ఇరువురినీ అపహరించిన మావోయిస్టులు అడవుల్లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ బావిలో మృతదేహం.. వెలికితీత

అపహరించిన ప్రాంతంలోనే బుదవారం అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నోట్లో తుపాకీ పెట్టి కాల్చినట్టు ఆనవాళ్లనుబట్టి తెలుస్తోందని, రక్తపు మరకల ఆధారంగా బుధవారమే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఆయనతో పాటు వెళ్లిన కుర్సం  రమేష్ ను విడిచిపెట్టినట్లు తెలిపారు. మరోపక్క హత్య ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగినందును పంచనామా అక్కడే జరగాలని వెంకటాపురం పోలీసులు పేర్కొనడంపై వివాదం చెలరేగింది. చివరకి స్థానికంగానే పంచనామా నిర్వహించడానికి సీఐ అంగీకరించడంతో సద్దుమణిగింది. 

హైదరాబాద్‌ పబ్‌లో యువతితో యువకుల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

ప్రజాభిప్రాయం మేరకే శిక్ష...
మృతదేహాం వద్ద మావోయిస్టులు వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాతం పేరుతో లేఖను వదిలారు. ‘రమేష్ ను వెంకటాపురం ఎస్సై జి. తిరుపతి ఇన్ ఫార్మర్ గా మార్చారు. మేం అడిగే సామాగ్రిని అతనితో పంపుతూ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మా కదలికలను గుర్తించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విషయం కలిపిన పాలపొడిని మాకు సరఫరా చేశారు. దాన్ని తాగిన దళ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. ఓ మావోయిస్టు మ్యాదరి భిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యారు. 

మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసి పోలీసుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. ప్రజాభిప్రాయం మేరకు అతన్ని చంపుతున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. తాను చేసిన తప్పులను రమేష్ ప్రజాకోర్టులో అంగీకరించినటటుగా ఉన్న వాయిస్ రికార్డును కూడా మావోయిస్టులు వాట్సప్ లో విడుదల చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu