మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని మావోయిస్టు పార్టీ తప్పుబట్టింది. తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని మావోయిస్టు పార్టీ తప్పుబట్టింది. తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఇంతకాలం పాటు కొనసాగిన ఈటల రాజేందర్ తన ఆస్తులను పెంచుకొన్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. హిందూత్వపార్టీ అయిన బీజేపీలో ఎలా చేరుతారని ఈటలను మావోయిస్టు పార్టీ ప్రశ్నించింది.
also read:ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు: ఈటలపై గంగుల ఫైర్
undefined
ఆస్తులను కాపాడుకొనేందుకే రాజేందర్ పార్టీ మారాడని ఆ ప్రకటనలో మావోయిస్టు పార్టీ విమర్శించింది. ఈటల రాజేందర్ పేదల భూములను ఆక్రమించారని మావోలు ఆరోపించారు.కేసీఆర్ బర్రెలు తినేవాడైతే ఈటల రాజేందర్ గొర్రెలు తినేవాడని జగన్ విమర్శించారు.
ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడు. అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు. దీంతో ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.విద్యార్ధి ఉద్యమంలో ఈటల రాజేందర్ పీడీఎస్‌యూ నేతగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆయన ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.