ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు: ఈటలపై గంగుల ఫైర్

Published : Jun 16, 2021, 02:30 PM IST
ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు: ఈటలపై గంగుల ఫైర్

సారాంశం

ఆత్మగౌరవాన్ని ఈటల  రాజేందర్ ఢిల్లీలో తాకట్టుపెట్టారని  తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.   

కరీంనగర్:ఆత్మగౌరవాన్ని ఈటల  రాజేందర్ ఢిల్లీలో తాకట్టుపెట్టారని  తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బుధవారం నాడు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ అభివృద్ది జరగలేదన్నారు. రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయన్నారు. ఇవాళ్టి నుండి ఎన్నికలయ్యేవరకు హుజూరాబాద్‌లోనే ఉంటానన్నారు.  హుజూరాబాద్ ఇవాళ గుడ్డి దీపంలా మారిందన్నారు. ఈ నియోజకవర్గాన్ని 
 అభివృద్ది చేసి చూపెడుతామని ఆయన స్పష్టం హామీ ఇచ్చారు. 

గత వారంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరారు.  అంతకుముందే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో ఆరు మాసాల్లోపుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇప్పటి నుండే క్షేత్రస్థాయి నుండి ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గులాబీ పార్టీ  ప్రయత్నాలు ప్రారంభించింది. మరో వైపు ఈటల రాజేందర్ కూడ తన పట్టును నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?