డాక్టర్ అవతారమెత్తిన వార్డ్ బాయ్: కోవిడ్‌కు చికిత్స , లక్షల్లో ఫీజు.. రోగుల పరిస్ధితి విషమం

Siva Kodati |  
Published : Jun 16, 2021, 02:26 PM IST
డాక్టర్ అవతారమెత్తిన వార్డ్ బాయ్: కోవిడ్‌కు చికిత్స , లక్షల్లో ఫీజు.. రోగుల పరిస్ధితి విషమం

సారాంశం

హైదరాబాద్ షాద్ నగర్‌లో నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంబీబీఎస్ డాక్టర్ అవతారమెత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్ కుమార్ కోవిడ్ ట్రీట్‌మెంట్ పేరుతో అమాయకుల నుంచి లక్షలు దండుకుంటున్నాడు. అతని మోసాన్ని గుర్తించిన స్థానికులు ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం చేస్తున్నారని షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

హైదరాబాద్ షాద్ నగర్‌లో నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంబీబీఎస్ డాక్టర్ అవతారమెత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్ కుమార్ కోవిడ్ ట్రీట్‌మెంట్ పేరుతో అమాయకుల నుంచి లక్షలు దండుకుంటున్నాడు. అతని మోసాన్ని గుర్తించిన స్థానికులు ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం చేస్తున్నారని షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 420, 336 ఐపీసీ సెక్షన్ల కింద ఫేక్ డాక్టర్ ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read:వీపుపై గాయం.. నేను నయం చేస్తా: సర్జరీ చేసిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్, రోగి మృతి

మరోవైపు స్థానికుల ఫిర్యాదుతో అమ్మ ఆసుపత్రిని పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈఎన్‌టీ డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్ పేరుతో లైసెన్స్ పొంది తనే ఒరిజినల్ డాక్టర్ ప్రవీణ్ అంటూ చెలామణి అవుతున్నాడు. అనుభవం లేని వైద్యులను తీసుకొచ్చి ఎంబీబీఎస్ డాక్టర్లు అంటూ వైద్యం చేయిస్తున్నాడు. ట్రీట్‌మెంట్ పేరుతో ఈ నకిలీ వైద్యుడు పలువురు  రోగుల్ని సీరియస్ స్టేజ్‌‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు