మరియమ్మ లాకప్ డెత్: మల్లు భట్టి విక్రమార్క పోరుకు మాణిక్యం ఠాగూర్ ఫిదా

Published : Jul 03, 2021, 02:13 PM ISTUpdated : Jul 03, 2021, 02:14 PM IST
మరియమ్మ లాకప్ డెత్: మల్లు భట్టి విక్రమార్క పోరుకు మాణిక్యం ఠాగూర్ ఫిదా

సారాంశం

తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ తో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మరియమ్మ లాకప్ డెత్ మీద మల్లుభట్టి విక్రమార్క చేసిన పోరును ఆయన అభినందించారు.

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ మీద కాంగ్రెసు శాసనసభా పక్షం (సీెల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన పోరాటాన్ని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ ప్రశంసించారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిపించడంలో మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారని ఆయన అన్నారు. 

మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన అన్నారు. మల్లుభట్టి విక్రమార్క మాణిక్యం ఠాగూర్ తో భేటీ అయ్యారు. తాము ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు మాణిక్యం ఠాగూర్ తెలిపారు. 

మల్లు భట్టి విక్రమార్కతో రాజకీయ, సంస్థాగత వ్యవహారాల గురించి మాట్లాడినట్లు ఆయన చెప్పారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు పెట్టిన ఒత్తిడి కేసీఆర్ ప్రభుత్వం వద్ద పనిచేసిందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ విషయాలను వెల్లడించారు. 

 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు