ఊపిరున్నంతవరకు టీఆర్ఎస్ లోనే.. : దానం నాగేందర్

By AN TeluguFirst Published Jul 3, 2021, 11:24 AM IST
Highlights

చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ తోనే ఉంటా.. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తాం. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే. అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ తోనే ఉంటా.. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తాం. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే. అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. 

ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ లో చిచ్చుపెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిమీద ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. 

డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసునన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. 

కాంగ్రెస్ లో కంటే టీఆర్ఎస్ లో నాకు పదింతలు గౌరవం దొరుకుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరగనందుకే ఆత్మ పరిశీలనతో టీఆర్ఎస్ చేరి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ చేరాలన్ను. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. 

తాను సీఎం కేసీఆర్ ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులమీద నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సి ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

click me!