మంచిర్యాల : భర్తను కత్తితో పొడిచి చంపి.. నేరుగా పీఎస్ కి వెళ్లిన భార్య..!

Published : Jul 03, 2021, 11:58 AM IST
మంచిర్యాల : భర్తను కత్తితో పొడిచి చంపి.. నేరుగా పీఎస్ కి వెళ్లిన భార్య..!

సారాంశం

తెలంగాణ, మంచిర్యాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మనస్పర్థల కారణంగా భర్తను ఓ భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న సాయికుంట కాలనీలో నాగరాజు (39), స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. 

గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపత్యంలో విచక్షణ కోల్పోయిన భార్య స్వరూప నిద్రిస్తున్న భర్తను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసింది. 

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. 
 
PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు