హుజురాబాద్ బరిలో మందకృష్ణ మాదిగ...: తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి సంచలనం

By Arun Kumar PFirst Published Aug 6, 2021, 11:17 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో మందకృష్ణ మాదిగను పోటీలో నిలిపి దళితుల ఓట్లను చీల్చడానికి బిజెపి కుట్ర చేస్తోందని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగతో కలిసి బిజెపి కుట్రలు చేస్తోందని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. దళితుల ఓట్లను చీల్చడానికి మహాజన పార్టీ తరుపున మంద కృష్ణను హుజురాబాద్ బరిలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ లు మంద  కృష్ణ మాదిగతో రహస్య మంతనాలు జరిపారని వంగపల్లి ఆరోపించారు. 

నిజంగానే బిజెపికి దళితుల పట్ల అంత ప్రేమే వుంటే తమ పార్టీ తరపునే హుజురాబాద్ అభ్యర్థిగానే మంద కృష్ణను పోటీలో నిలపాలన్నారు వంగపల్లి. కాంగ్రెస్ పార్టీ కూడా దళిత ఓట్లను చీల్చడానికి హుజురాబాద్ బరిలో ఎస్సీ అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇలా రెండు జాతీయ పార్టీలో సింద్దాంతాలను  పక్కకు పెట్టి దళితులకు సంక్షేమ ఫలాలు అందకుండా కుట్రలు చేస్తున్నాయని వంగపల్లి మండిపడ్డారు. 

read more  ఈటలకు షాక్... మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ గూటికి సర్పంచ్ లు

దళిత బంధు పథకం ద్వారా బలహీర వర్గాల ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని... దీంతో హుజురాబాద్ లో తమ గెలుపు అసాధ్యమని బిజెపి గ్రహించింది. అందువల్లే దళితులంగా టీఆర్ఎస్ వైపు వుండకుండా ఓట్లు చీల్చడానికే మంద కృష్ణను పోటీలోకి దించుతున్నారని వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

అనాదినుండి వివక్షకు గురవుతూ వస్తున్న దళితుల బాగుకోసం సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని... ఇలాంటి దళిత బంధు పతకాన్ని అడ్డుకునేందుకు మంద కృష్ణ  ప్రయత్నిస్తున్నారని వంగపల్లి ఆరోపించారు. దళితులకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్న మంద కృష్ణను హుజురాబాద్‌ దళిత సమాజమే తగిన బుద్ది చెబుతుందని వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. 

click me!