ఈటలకు షాక్... మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ గూటికి సర్పంచ్ లు

By Arun Kumar PFirst Published Aug 6, 2021, 10:19 AM IST
Highlights

ఉపఎన్నికల వేళ హుజురాబాద్ రాాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగయినా ఓడించాలన్న పట్టుదలతో వున్న టీఆర్ఎస్ మంత్రి  హరీష్ రావును రంగంలోకి దింపింది. 

కరీంనగర్: ఉపఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్యంగా టీఆర్ఎప్ పావులు కదుపుతోంది. ఇందుకోసం బిజెపి నుండి టీఆర్ఎస్ లోకి భారీగా వలసలను ఆహ్వానిస్తోంది. ఇలా తాజాగా పలు గ్రామాలకు చెందిన బిజెపి సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.  

హుజురాబాద్ నియోజకవర్గం ఇళ్లందకుంట మండలంలోని చిన్నకోమటపల్లి సర్పంచ్ సరోజ -నాగన్న, భోగంపాడ్ సర్పంచ్ తిరుపతి రెడ్డి లు టీఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటే ఈ గ్రామాల ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లు కూడా బిజెపిని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీష్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ , బీజేపి రెండో శ్రేణి నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ... హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి  బిజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. ఇందుకోసం అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.  

read more  ఈటల రాజేందర్ హయాంలో బాగుపడ్డది ఆయనొక్కరే...: మంత్రి గంగుల కమలాకర్

 టీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బకొట్టడానికి బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. బిజేపీకి అనుకూలంగా వుండేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దళిత అభ్యర్థులను బరిలోకి దింపేతే దళిత ఓట్లు చీల్చవచ్చనే దిగజారుడు రాజకీయాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. బిజేపీ పార్టీ సైతం ఇతర దళిత నేతలను హుజూరాబాద్‌లో పోటీ చేయించాలని చూస్తున్నదని... దీనివల్ల తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనుకూలత ఏర్పడుతుందనే భ్రమలో ఉన్నదని విమర్శించారు.  దళితబంధు పథకంతో దళితులంతా టీఆర్‌ఎస్‌ వైపే నిలవడం ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక కుట్రలు, కుమ్మక్కులకు పాల్పడుతున్నాయని హరీష్ మండిపడ్డారు. 

ప్రధాన నరేంద్ర మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ , గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశ్యంతో ఈటల రాజేందర్‌ ప్రచార శైలి మార్చారని హరీశ్‌రావు ఆరోపించారు. మోడీ ఫోటో, బిజేపీ జెండాలను దాచి  కేవలం తన ఫోటోను, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఎద్దేవా చేశారు. బిజేపీ  పార్టీ తరపున గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమనే విషయం అందరికీ తెలుసన్నారు. బిజేపీ పార్టీపై విశ్వాసం ఉంటే ఇదే ఈటల రాజేందర్‌ వెళ్లి మోడీ దగ్గర వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా అంటూ ప్రశ్నించారు. 

 ఈటల ఎత్తుగడలకు మోసపోయే పరిస్థితి హుజూరాబాద్‌లో లేదన్నారు.  ఇప్పటికే పెట్రోల్‌ ధర రూ.100 దాటిందని, అక్కడ బిజేపీకి ఓటు వేస్తే వచ్చే ఏడాదిలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రూ.200 దాటడం ఖాయమని, గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1500 దాటుతుందని అన్నారు. మోడీ అవలంభిస్తున్న విధానాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్‌ కంటే బలహీనంగా మారిందన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో బిజేపీ పార్టీని బండకేసి కొట్టారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. రేపు హుజూరాబాద్‌లో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. 

వరంగల్  అర్భన్ జిల్లా ఎన్ఎస్ యూఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తో పాటు 50 మంది యువకులు, చిన్నపాపాయ్ పల్లి గ్రామం నుండి బీజేపీ వార్డు సభ్యులు తనుగుల అంజలి సునీల్ , శ్రీనివాస్ , తిరుపతి , యువ మోర్చా నాయకులు ప్రవీణ్ , చందర్ , దేవరాజు లు మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్  లో చేరారు. 

click me!