మ్యాట్రిమోని ఫ్రాడ్ : ఖరీదైన బహుమతులు పంపుతున్నానంటూ.. నర్సుకు టోకరా...

Published : Aug 06, 2021, 10:45 AM IST
మ్యాట్రిమోని ఫ్రాడ్ : ఖరీదైన బహుమతులు పంపుతున్నానంటూ.. నర్సుకు టోకరా...

సారాంశం

నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా చేస్తున్నానంటూ ఈమె పరిచయం పెంచుకుంది. ఇద్దరి మధ్య రోజు రోజుకు మాటలు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్ లోనే ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని నాగమణిని నమ్మించాడు. డిసెంబర్ నాటికి భారత్ కు వస్తున్నానని, అయితే ఈలోపు మన ప్రేమ గుర్తుగా కొన్ని ఖరీదైన వస్తువులు పంపుతానన్నాడు. 

హైదరాబాద్ : వివాహం కోసం తన ప్రొఫైల్ ని క్రిస్టియన్ మ్యాట్రిమోనిలో అప్ లోడ్ చేిన యువతికి భారీ టోకరా వేశాడు సైబర్ నేరగాడు. తాను యూకేలో జనరల్ ఫిజీషియన్ అంటూ అదర్వనగర్ కు చెందిన నర్సు నాగమణికి ఇటీవల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 

నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా చేస్తున్నానంటూ ఈమె పరిచయం పెంచుకుంది. ఇద్దరి మధ్య రోజు రోజుకు మాటలు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్ లోనే ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని నాగమణిని నమ్మించాడు. డిసెంబర్ నాటికి భారత్ కు వస్తున్నానని, అయితే ఈలోపు మన ప్రేమ గుర్తుగా కొన్ని ఖరీదైన వస్తువులు పంపుతానన్నాడు. 

రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ నాగమణికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు యూకే నుంచి ఖరీదైన గిఫ్ట్ లు వచ్చాయని, వాటిని సొంతం చేసుకోవాలంటే ఛార్జీస్ చెల్లించాలన్నాడు. గుడ్డిగా నమ్మిన నాగమణి పలు దఫాలుగా రూ.5లక్షలు నగదును ట్రాన్స్ ఫర్ చేసింది. 

డబ్బు చేతికి అందినాక ఫోన్ మాట్లాడటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీయగా.. అది ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని ఇరుగు పొరుగు వారు చెప్పాడు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu