షాకింగ్.. ముఠా మారాడని.. బట్టలూడదీసి, బిల్డింగ్ చుట్టూ పరిగెత్తించి.. ఆరు గంటలపాటు నరకం..

Published : Dec 08, 2022, 07:36 AM IST
షాకింగ్.. ముఠా మారాడని.. బట్టలూడదీసి, బిల్డింగ్ చుట్టూ పరిగెత్తించి.. ఆరు గంటలపాటు నరకం..

సారాంశం

హైదరాబాద్ లో ఓ రౌడీషీటర్ ముఠా దారుణానికి తెగించింది. తమ దగ్గర పనిచేయడం మానేసిన యువకుడికి ఆరు గంటలపాటు నరకం చూపించింది. అతడిని బట్టలూడదీసి మరీ కొడుతూ.. పరుగులు పెట్టించింది. 

హైదరాబాద్ : ఓ యువకుడిని కొందరు  నగ్నంగా మార్చి.. ఆరు గంటల పాటు నరకం చూపించారు. దీనికి కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఓ ముఠా రౌడీయిజంతో దందాలకు పాల్పడుతోంది. ఈ ముఠాలోని ఓ యువకుడు కొంతకాలంగా వీరిని వదిలిపెట్టి.. వేరొకరితో కలిసి పని చేస్తున్నాడు. దీంతో ఈ ముఠా నాయకుడికి కోపం వచ్చింది. అంతే తన అనుచరులతో కలిసి ఈ దారుణానికి తెగించాడు. ఆ యువకుడిని పట్టుకువచ్చి.. బట్టలన్నీ ఊడదీసి.. నరకం చూపించారు.  ఈ ఘటన  మంగళవారం హైదరాబాద్ శివార్లలోని కిస్మత్ పేటలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

బండ్లగూడ జాగీర్ లోని సన్ సిటీ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు వృత్తిరీత్యా కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మొదట్లో రౌడీషీటర్ అయిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ముఠాతో కలిసి తిరిగేవాడు. ఆ తర్వాత ప్రస్తుతం కొంతకాలంగా మరో ముఠాతో అతను తిరుగుతున్నాడు. ఈ విషయం ఇర్ఫాన్ ముఠాకు తెలిసింది. దీంతో అతడికి బుద్ది చెప్పాలనుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం కారు సర్వీసింగ్ కోసం మహమ్మద్ ఇర్ఫాన్ లంగర్ హౌస్ కి వచ్చాడు. అప్పటికే అతని పై కోపంగా ఉన్న ఇర్ఫాన్ ఇదే అదనుగా భావించాడు. 

హైదరాబాద్ లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా.. నాలుగు వాట్సప్ గ్రూపులు, ఒక్కోదాంట్లో 400మంది సభ్యులతో దందా..

ఫవాజ్, ముదాసిర్, షహెన్ షా, జహీద్ అనే తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి, మహమ్మద్ ఇర్ఫాన్ ను అక్కడి నుంచి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. అతడిని కిస్మత్ పురాలోని ఓ పాత బిల్డింగ్ లో బంధించారు. అప్పటికే అక్కడికి మరో పదిమంది చేరారు. వీరంతా కలిసి బాధితుడిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు. ముందు బాధితుడిని నగ్నంగా మార్చారు. తరువాత భవనం ఆవరణలో పరుగులు పెట్టించారు.  ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా బెల్టుతో కొట్టారు. ఇలా సాయంత్రం 7 గంటల వరకూ దాడి కొనసాగుతూనే ఉంది. 

అంతటితో ఆగకుండా ఈ దాడికి సంబంధించిన వీడియోలను షూట్ చేశారు. అవే వారిని అడ్డంగా పట్టిస్తాయన్న విషయం మరిచారు. ఆ తర్వాత ఈ వీడియోలకు హిందీ పాటలను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా వేశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో  బుధవారం ఈ వీడియోలు  వైరల్ అయ్యాయి. ఇర్ఫాన్ ముఠా చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. వారి నుంచి ఎలాగో బయటపడ్డ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ రాజేంద్రనగర్ పోలీసులు ఐదుగురు మీద కేసులు పెట్టారు.  దాడిలో పాల్గొన్న మరో పదిమంది వివరాలను సేకరిస్తున్నారు. ఇక ప్రధాన నిందితుడైన ఇర్ఫాన్ మీద పలు పోలీస్ స్టేషన్ లలో క్రిమినల్ కేసులు, సైబరాబాద్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.  అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu