భూ పరిహరం కోసం ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నం

Published : Jan 30, 2023, 02:26 PM IST
భూ పరిహరం కోసం  ప్రగతి భవన్ ముందు  ఆత్మహత్యాయత్నం

సారాంశం

తమ భూమికి  పరిహరం చెల్లించలేదనె  కారణంతో ఇబ్రహీంపట్నానికి  చెందిన  ఐలేష్ అనే వ్యక్తి   ప్రగతి భవన్  ముందు  ఇవాళ  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్:  ప్రగతి  భవన్ ముందు  సోమవారం నాడు  ఐలేష్ అనే వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన  ఐలేష్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  ఇబ్రహీంపట్నానికి  చెందిన ఐలేష్   కు చెందిన  భూమిని  ప్రభుత్వం తీసుకుని  పరిహరం చెల్లించలేదని  బాధితుడు  ఆరోపిస్తున్నాడు.ఈ విషయమై   అధికారుల చుట్టూ తిరిగినా  ఫలితం లేకపోయిందన్నారు.  తన ఆవేదనను  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో  బాధితుడు  ఐలేష్   ఇవాళ  ప్రగతి భవన్ కు వచ్చారు.  ప్రగతి భవన్ ముందు  కిరోసిన్ పోసుకుని  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  ప్రగతి భవన్ వద్ద  విధులు నిర్వహిస్తున్న  సెక్యూరిటీ  సిబ్బంది వెంటనే  ఐలేష్ ను  అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు