నాకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు.. అధికార మదంతో ఇబ్బంది పెట్టారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

By Sumanth Kanukula  |  First Published Jan 30, 2023, 1:51 PM IST

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అధికార మదంతో తనను ఇబ్బంది పెట్టారని అన్నారు.


ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తాను అడిగిన హామీలు ప్రజల గురించే అని అన్నారు. అధికార మదంతో తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఓటమికి తానే కారణమని తనకు ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు.అధికారం ఎవరి అబ్బసొత్తుకాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగువేయనని చెప్పారు. లక్షలాది గుండెల మద్దతుతో తాను వస్తున్నానని.. మీరు కొట్టుకు పోతారని అన్నారు. 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రుణమాఫీ 20 శాతం మాత్రమే చేశారని విమర్శించారు.

ఇక, బీఆర్ఎస్ అధిష్టానంపై కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పొంగులేటి త్వరలోనే వేరే పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతుంది. అయితే తాను ఏ పార్టీలో చేరతాననే విషయంపై పొంగులేటి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. 
 

Latest Videos

click me!