160 రూపాయల కోసం గొంతు కోసి హత్య, ఇద్దరి అరెస్ట్..

Published : Jul 27, 2022, 10:51 AM IST
160 రూపాయల కోసం గొంతు కోసి హత్య, ఇద్దరి అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్ లో కేవలం 160 రూపాయలకోసం ఓ వ్యక్తిని ఇద్దరు దారుణంగా.. గొంతుకోసి హత్య చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.   

హైదరాబాద్ : హైదరాబాద్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ సమీపంలోని బస్టాండ్ వద్ద ఈ నెల 24న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మధ్య మండలం డీసీపీ రాజేంద్ర చంద్ర, అడిషనల్ డిసిపి రమణారెడ్డి, ఏసీపీ వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. జహీరాబాద్, ramnagarకు చెందిన బోయిన మహేష్ కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా, డంజార్గావ్ కు చెందిన జె. అనిల్ కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.

అడ్డా కూలీలుగా పనిచేసుకుంటూ.. ఫుట్పాత్లపై నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఫుట్ పాత్ లపై పడుకున్న వ్యక్తులను బెదిరించి, డబ్బులు లాక్కుని జల్సాలు చేసేవారు. ఈ నెల 24న lakadikapool బస్ స్టాప్ వద్ద నిద్రిస్తున్న ఓ యాచకుడిని టార్గెట్ చేసుకున్న వారు.. కత్తితో అతడి గొంతు కోసి జేబులో ఉన్న160 రూపాయలు నగదును తీసుకొని పారిపోయారు. రక్తం మడుగులో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నాడు అంటూ.. పోలీసులకు సమాచారం అందడంతో.. సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మృతి చెందాడు. 

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల గేట్ల ఎత్తివేత: మూసీ పరివాహక ప్రాంతాల్లో అలెర్ట్

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బోయిన మహేష్, జె. అనిల్ కుమార్ లను నిందితులుగా గుర్తించారు. నాంపల్లి, బజార్ ఘాట్ లోని కాలభైరవ దేవాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని డిసిపి తెలిపారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ సత్తయ్య, ఎస్సై మాధవి, కానిస్టేబుళ్లు అజీముద్దీన్, అహ్మద్ షా ఖాద్రీలను డీజీపీ అభినందించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు నగదు రివార్డులను అందజేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu