జాతకంలో చెప్పారని.. కూతురిని గొంతుకోసి చంపేశాడు..

Published : Aug 21, 2023, 11:02 AM IST
జాతకంలో చెప్పారని.. కూతురిని గొంతుకోసి చంపేశాడు..

సారాంశం

జాతకంలో కూతురు భవిష్యత్తులో కష్టపడుతుందని ఉండడంతో ఓ తండ్రి దారుణానికి తెగించాడు. ఎనిమిదేళ్ల ఆ చిన్నారి గొంతుకోసి చంపేశాడు. 

హైదరాబాద్ : కన్న పిల్లల మీద పిచ్చి ప్రేమ ఒక్కోసారి ఆ తల్లిదండ్రులతో ఎలాంటి పనులు చేపిస్తుందో ఊహించలేం.  కన్న కూతురు మీద విపరీతమైన ప్రేమతో ఓ తండ్రి  ఆమెను  అతిదారుణంగా చంపేశాడు. దీనికి కారణం భవిష్యత్తులో ఆ చిన్నారి  కష్టాలు అనుభవిస్తుందని జాతకంలో చెప్పారు. అది  నమ్మిన ఆ తండ్రి  భవిష్యత్తులో తన కూతురు కష్టాలు పడొద్దని.. భార్య సరిగా చూసుకోకపోతే పెద్దయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోతుందని అపోహ పడ్డాడు.

దీంతో చిన్నారి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నా కూడా కనికరించలేదు. 8 ఏళ్ల  తన కూతురిని కిరాతకంగా హతమార్చాడు.  దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… కుందేటి చంద్రశేఖర్ (40), హిమబిందు దంపతులు. వీరికి ఒక కూతురు మోక్షజ్ఞ (8) ఉంది. వీరి స్వస్థలం విజయవాడ.వీరిద్దరూ ఓ ఐటీ కంపెనీలో పని చేసేవారు.

ఏడుగురు శిశువులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ నర్సుకు జీవిత ఖైదు...

అయితే, కొంతకాలానికి చంద్రశేఖర్ పనితీరు బాగాలేదని సంస్థ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. తన ఉద్యోగం పోవడానికి భార్యే కారణమని ఆమె మీద కక్ష కట్టాడు చంద్రశేఖర్. అదే విషయంగా భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక భార్య హిమబిందు, మోక్షజ్ఞను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. 

హిమబిందు తల్లిదండ్రులు బిహెచ్ఇఎల్ లో ఉంటారు. చంద్రశేఖర్ భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత వారానికి రెండుసార్లు వెళ్లి కూతురిని చూసొస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఓసారి కూతురు జాతకాన్ని చూపించాడు. అందులో కూతురు భవిష్యత్తులో అనేక కష్టాలు పడుతుందని తేలింది. తనను వదిలేసి భార్య వెళ్లిపోవడంతో  కూతురిని కూడా కష్టాలపాలు చేస్తుందని.. కూతురు లేకుండా భార్య కూడా ఒంటరిగా ఉండాలని అనుకున్నాడు.

దీనికోసం మోక్షజ్ఞను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.  దీంట్లో భాగంగానే శుక్రవారం సాయంత్రం కన్న కూతురిని స్కూల్ నుంచి తనతో పాటు కారులో తీసుకొచ్చాడు. కారులోనే గొంతు కోసి చంపేశాడు.  స్కూలు సమయం గడిచిపోయినా, ఇంకా కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ భార్య, ఆమె కుటుంబ సభ్యులు.. అనుమానంతో చంద్రశేఖర్ కి ఫోన్ చేశారు. 

కూతురుని తానే తీసుకువచ్చానని నిద్రపోతుందని అబద్ధం  చెప్పాడు. మోక్షజ్ఞను  తీసుకువెళ్లడానికి వారు వస్తామని అంటే.. తానే తీసుకొచ్చి దింపుతానని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలని… ఓఆర్ఆర్ మీద తారామతిపేట- కోహెడ మధ్య తిరిగాడు. కానీ ఆయనకి  మృతదేహాన్ని బయటకి విసిరేసే అవకాశం దొరకలేదు.  

ఇలా తిరుగుతున్న క్రమంలోనే రాత్రి పదిన్నర గంటల సమయంలో కారు టైరు పేలింది.  కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది.  దీంతో ఓ వ్యక్తి వెళ్లి అది గమనించాడు.  అందులో ఉన్న చంద్రశేఖర్ దుస్తులకు రక్తపు మరకలు ఉన్నాయి. మరోవైపు కారులో చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే అతను డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేశాడు.  దీంతో దారుణ ఘటన వెలుగు చూసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం