బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లి... భూపాలపల్లి టికెట్ చారికే ఇవ్వాలంటూ టవర్ ఎక్కిన యువకులు

Published : Aug 21, 2023, 10:11 AM ISTUpdated : Aug 21, 2023, 10:37 AM IST
బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లి... భూపాలపల్లి టికెట్ చారికే ఇవ్వాలంటూ టవర్ ఎక్కిన యువకులు

సారాంశం

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణా రెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ మదుసూధనాచారికే భూపాలపల్లి టికెట్ ఇవ్వాలంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థులు లిస్ట్ రెడీ అయ్యిందన్న ప్రచారంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. టికెట్లు వీరికే దక్కనున్నాయి... కొందరు సిట్టింగ్ లను సీఎం కేసీఆర్ పక్కనపెట్టనున్నారంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలా టికెట్లు దక్కేవారి లిస్టులో వున్న నాయకులు ఆనందిస్తుంటే... టికెట్లు ఆశించి లిస్ట్ లో పేరులేకపోవడంతో కొందరు ఆందోళనకు గురవుతున్నారు. మీడియా, సోషల్ మీడియా ప్రచారంతో ఎక్కడ నిజంగానే తమ నాయకుడికి  టికెట్ దక్కదేమోనని కంగారుపడి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. ఇలా భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మదుసూధనాచారి వర్గీయులు ఏకంగా సెల్ టవర్ ఎక్కిమరీ ఆందోళనకు దిగారు. 

భూపాలపల్లి అసెంబ్లీ టికెట్ గండ్ర వెంకటరమణా రెడ్డికే దక్కే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మదుసూధనాచారి కూడా ఇదే నియోజకవర్గం నుండి  పోటీచేయాలన బావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బిఆర్ఎస్ లో చేరిన గండ్రకు కాకుండా సీనియర్ నాయకులు మదుసూధనాచారికి టికెట్ ఇవ్వాలని అనుచరులు కోరుతున్నారు. ఇలా శ్రీకాంత్, పూర్ణ యాదవ్, పృథ్వీఅనే బిఆర్ఎస్ కార్యకర్తలు మదుసూధనాచారికి మద్దతుగా సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. 

యువకుల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. మదుసూధనాచారికే బిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని సెల్ టవర్ పైనుండే అదిష్టానాన్ని కోరారు. పోలీసులు యువకులకు నచ్చజెప్పి టవర్ పైనుండి దింపారు. 

Read More  నేడే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా:90 మందితో లిస్ట్

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకే బిఆర్ఎస్ టికెట్ దక్కవచ్చన్న ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ లో మధుసూదనాచారి వర్గీయులు సమావేశమయ్యారు. ఇతర పార్టీలనుండి వచ్చినవారికి కాకుండా ఎప్పటినుండో పార్టీలో కొనసాగుతూ బలోపేతం చేసిన మధుసూదనాచారికి భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని బిఆర్ఎస్ అదిష్టానాన్ని కోరారు. లేదంటే 200 కు పైగా ఉద్యమకారులం పోటీకి దిగుతామంటూ మాజీ స్పీకర్ వర్గం బిఆర్ఎస్ అదిష్టానాన్ని హెచ్చరించారు. 

ఇదిలావుంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అధికార బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లి మొదలయ్యింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి కేసీఆర్ అవకాశం ఇవ్వడంలేదంటూ సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియా మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా చోట్ల సిట్టింగ్ లు అప్రమత్తమై తమ అనుచరులతో ఇప్పటికే రాజకీయ భవిష్యత్ గురించి చర్చలే జరుపుతున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే కేసీఆర్ నిర్ణయమైతే తాము చాలా సంతోషిస్తామని... తాము కోరుకునేది కూడా ఇదేనంటూ కొందరు ఇల్లందు బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కూడా టికెట్ దక్కకపోవచ్చని... అలాగని ఈ టికెట్ ఆశిస్తున్న జిహెచ్ఎంసి మాజీ మేయర్ కు కూడా ఆ  అవకాశం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుండి  మాజీ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి  పేరును బీఆర్ఎస్  నాయకత్వం  పరిశీలిస్తుందనే  ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మేయర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎస్సీ రిజర్వుడ్ జహిరాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఇటీవలే బిఆర్ఎస్ లో చేరిన నరోత్తంకు టికెట్ ఇవ్వాలని అదిష్టానం భావిస్తోందట. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..