గర్భం దాల్చిన విషయం అతనికి చెప్పి ఆమె పెళ్లి చేసుకోమని అడిగింది. ఈ క్రమంలో సదరు యువతి ని కిడ్నాప్ చేసి వారం రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అతను ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత. గ్రామంలో డబ్బు, పలుకుబడి ఉన్న ఆయన కన్ను ఓ యువతిపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఓ వారం రోజుల పాటు కిడ్నాప్ చేసి మరీ తన కోరిక తీర్చుకున్నాడు. ఇంతలో సదరు యువతి గర్భవతి అని తేలింది. దీంతో బాధిత కుటుంబం అతనిని ప్రశ్నించగా.. తొలుత తనకేం తెలీదని బుుకాయించాడు. తర్వాత నిజం అంగీకరించి ఆమె శీలానికి వెల కట్టాడు. ఈ దారుణ సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన ఓ నాయకుడు(49) అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(27) పై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది.
గర్భం దాల్చిన విషయం అతనికి చెప్పి ఆమె పెళ్లి చేసుకోమని అడిగింది. ఈ క్రమంలో సదరు యువతి ని కిడ్నాప్ చేసి వారం రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు నాయకుడిపై తమకు అనుమానం ఉందని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.
Also Read ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. 90ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా......
రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన యువతి ఇంటికి చేరింది. తనకు జరిగిన అన్యాయం మొత్తం తల్లిదండ్రులకు వివరించింది. దీంతో.. యువతి తల్లిదండ్రులు, తమ బంధువుల, గ్రామస్థులతో కలిసి దాడి చేయగా... నేరం చేసినట్లు సదరు నాయకుడు అంగీకరించాడు.
అయితే.. పెళ్లి మాత్రం చేసుకోనని.. యువతిని గర్భవతిని చేసినందుకుగాను రూ.6లక్షలు ఇస్తానని బేరం కుదర్చడం గమనార్హం. ఆ డబ్బు ఇచ్చి.. వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకన్నట్లు తెలుస్తోంది. అయితే... ఈ వ్యవహారమంతా పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్నా.. కనీసం పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వినపడుతున్నాయి.